‘టీ-పాలిటిక్స్’లో ట్విస్ట్: రేసులో నెంబర్లు మారాయి!

-

తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి…ఎప్పుడు ఏ పార్టీ లీడ్ లోకి వస్తుందో…ఈ పార్టీ కింద పడిపోతుందో అర్ధం కాకుండా ఉంది. ఎలాగో టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి…ఆ పార్టీ మొదట స్థానంలో ఉందని అనుకోవచ్చు. అయితే ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నంత కాలం టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేకుండానే ఉంది. కానీ ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుందో, అప్పటినుంచి సీన్ మారిపోయింది. అలాగే దుబ్బాక ఉపఎన్నిక తర్వాత పరిస్తితి మరింతగా మారింది. దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ గెలిచాక…టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఎదురైంది.

అయితే ఎప్పుడైతే టి‌పి‌సి‌సి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి వచ్చారో…అప్పుడు కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. రేవంత్ దూకుడుతో అనూహ్యంగా బీజేపీ రేసులో వెనక్కి వెళ్లింది. ఇక ఎప్పుడైతే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారో…అప్పటినుంచి బీజేపీకి ఛాన్స్ దొరికింది. పైగా హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలిచాక టీఆర్ఎస్ కు పోటీ ఇచ్చేది బీజేపీనే ప్రచారం మొదలైంది. ఇక టీఆర్ఎస్ సైతం బీజేపీనే టార్గెట్ చేసి…ఆ పార్టీనే హైలైట్ చేసే పరిస్తితి వచ్చింది. అంటే కేసీఆర్ తెలివిగా,..కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే టార్గెట్ చేసి రాష్ట్రంలో లబ్ది పొందాలని చూశారు. దీంతో బీజేపీ రేసులో ముందుకొచ్చినట్లు కనిపించింది.

ఇక ఇలా రాజకీయం నడుస్తుండగానే…రేసులో వెనుకబడిన కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్, ఇప్పుడు సడన్ గా వలసలకు తెరలేపి టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చింది. వరుసపెట్టి టీఆర్ఎస్ నాయకులని కాంగ్రెస్ లో చేర్చుకుంటుంది. ఇంకా కొంతమంది నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది.

అయితే ట్విస్ట్ ఏంటంటే…ఇటీవల బయటపడిన ప్రశాంత్ కిషోర్ సర్వేలో కాంగ్రెస్ పార్టీ రేసులో రెండోస్థానంలో ఉందని తెలిసింది…ఇక బీజేపీ మూడో స్థానంలో ఉందని తేలింది. అంటే టీఆర్ఎస్ పార్టీకి పోటీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అని తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణలో రాజకీయ రేసులో నెంబర్లు మారిపోతున్నాయని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news