జనసేన అభ్యర్ధులని ఫిక్స్ చేస్తున్న పవన్..!

-

నెక్స్ట్ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా? టీడీపీతో పొత్తులో పోటీ చేస్తుందా? దాదాపు పొత్తులోనే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే జనసేన ఒంటరిగా వెళితే ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పలేని పరిస్తితి. ఇప్పుడు ఉన్న అంచనాల ప్రకారం..ఆ పార్టీకి 10 సీట్లు లోపు మాత్రమే వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. అయితే జనసేన బలంపై పవన్‌కు కూడా ఒక అంచనా ఉంటుందని చెప్పవచ్చు.

ఎందుకంటే ఆయన ఆ మధ్య ఎప్పుడైతే తనకు అందరూ జనసేనకు మద్ధతు ఇస్తారనే నమ్మకం వస్తుందో..అప్పుడే ఒంటరిగా బరిలో ఉంటానని, అప్పటివరకు కష్టమే అని ఆయన అన్నారు. అంటే పొత్తు వైపే ఆయన మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఒంటరిగా వెళితే అటు జనసేన గెలవదు..ఓట్లు చీల్చి టి‌డి‌పికి నష్టం, వైసీపీకి లాభం జరుగుతుంది. వైసీపీని ఓడించాలని చూస్తున్న పవన్..ఎలాగైనా పొత్తులోనే పోటీ చేయాలని చూస్తున్నారు.

పొత్తులో పోటీ చేస్తే ఎక్కువ సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక పొత్తు లో ఉంటే కొన్ని సీట్లు తీసుకోవాలని పవన్ చూస్తున్నారు. వాటిల్లో ఇప్పటికే కొన్ని స్థానాల్లో అభ్యర్ధులు కూడా రెడీగా ఉన్నారు. అలా రెడీగా ఉన్నవారిలో తెనాలిలో నాదెండ్ల మనోహర్ ఉన్నారు..పొత్తు ఉంటే ఈ సీటు జనసేనకే. ఇక కైకలూరు సీటుని సైతం తీసుకోవాలని చూస్తున్నారు. ఇటు విజయవాడ వెస్ట్ సీటులో పోతిన మహేశ్ ఉన్నారు.

ఇక భీమవరంలో పవన్ పోటీ చేసే ఛాన్స్ ఉంది. తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్, నరసాపురంలో బొమ్మిడి నాయకర్ పోటీ చేసే ఛాన్స్ ఉంది. రాజోలులో ఇంకా ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు. ముమ్మిడివరంలో పితాని బాలకృష్ణ ఉన్నారు. ఇక ఎలమంచిలిలో సుందరపు విజయ కుమార్ ఇలా కొన్ని సీట్లలో పోటీ చేయడానికి జనసేన నాయకులు సిద్ధంగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news