క్వాలిటీ లీడర్..కానీ నో క్లారిటీ!

-

తెలుగు రాష్ట్రాల్లో పవన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో తెలిసిందే. అలాగే రాజకీయ రంగంలో కూడా ఫాలోయింగ్ ఎక్కువే. కాకపోతే రాజకీయంగా పవన్‌కు పూర్తి స్థాయి బలం లేకపోవడమే పెద్ద మైనస్. అలా అని ప్రజల్లో పవన్ పై నెగిటివ్ పెద్దగా లేదు. ఆయన మంచి నాయకుడు అని, అవినీతి మచ్చ లేని నేత అని, నిజాయితీ కలిగిన నాయకుడు అని అంతా అనుకుంటారు.

అలా ఉన్నా సరే నిలకడ లేని తనం ఒక్కటే పవన్‌ని రాజకీయంగా ఎదగకుండా ఇబ్బంది పెడుతుందనే భావన కూడా ఉంది. జనసేన పెట్టి 10 ఏళ్ళు అయింది..కానీ ఇంతవరకు రాజకీయంగా సక్సెస్ కాలేదు. ఎందుకంటే అపోజిట్ లో బలంగా వైసీపీ, టి‌డి‌పిలు ఉన్నాయి. ఆ రెండు పార్టీల స్పేస్‌ని జనసేన తీసుకోలేకపోతుంది. పైగా పవన్ పూర్తి స్థాయిలో రాజకీయాలు చేయకపోవడం మైనస్. ఆయన కొన్ని రోజులు సినిమాలు చేయడం,.కొన్ని రోజులు రాజకీయాలు చేస్తున్నారు. దీని వల్ల జనసేన పార్టీ పూర్తిగా బలపడలేదు.

Pawan

వాస్తవానికి గత ఎన్నికల తర్వాత టి‌డి‌పి బలహీనపడింది. ఇప్పటికీ అదే పరిస్తితిలో ఉంది. అలాంటప్పుడు టి‌డి‌పి ప్లేస్ లో జనసేన తీసుకోవడానికి చూడాలి. కానీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని..టి‌డి‌పిని బలపడేలా పవన్ చేస్తున్నారు. పైగా ఒకోసారి ఒక మాట మాట్లాడతారు. ఉదాహరణకు పొత్తులపై ఆయన రకరకాల వైఖరి వ్యక్తపరిచారు. అటు బి‌జే‌పితో కలిసి ముందుకెళ్లే విషయంలో ఒక క్లారిటీ లేదు.

అలాగే ఒకసారి తానే సి‌ఎం అంటారు..ఒకసారి సి‌ఎం అయ్యే బలం లేదంటారు. అంటే ఇలా నిలకడలేని మాటలు చాలా చెబుతూ వచ్చారు. దాని వల్ల ప్రజలు..పూర్తిగా పవన్ వైపు ఉండటం లేదు. పవన్ క్వాలిటీ గల నాయకుడైనా..క్లారిటీ లేదని అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news