పాయింటే: బాబు-పవన్‌ లు అదే పనిలో ఉన్నట్లున్నారు?

-

మొన్న రిపబ్లిక్ ఫంక్షన్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్….వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించిన దగ్గర నుంచి ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒక వైపు పవన్ కల్యాణ్ తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ముందుకెళుతున్నారు. మరో వైపు వైసీపీ నేతలు ప్రతిరోజూ మీడియా ముందుకొచ్చి పవన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పనిలో పనిగా చంద్రబాబుని తీసుకొచ్చి ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తున్నారు. బాబు స్క్రిప్ట్ ప్రకారమే పవన్ నడుస్తున్నారని అంటున్నారు.

ఇక తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వంతు వచ్చింది…ఆయన కూడా తన నోటికి పనిచెప్పారు. పవన్ కల్యాణ్‌కు దమ్ము ఉంటే ఒంటరిగా పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. బాబుతో కుమ్మక్కై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని, 40 ఏళ్ల చరిత్ర ఉన్నటి‌డి‌పికే ఒంటరిగా పోటి చేసే దమ్ము లేదని బాలినేని విమర్శించారు.

అయితే బాలినేని విమర్శల్లో కాస్త లాజిక్ ఉన్నట్లే కనిపిస్తోంది. ఆయన కరెక్ట్ పాయింట్లే మాట్లాడారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో బాబు-పవన్‌లు పొత్తు పెట్టుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ పొత్తు విషయం పక్కనబెడితే….పవన్ ఒంటరిగా పోటీ చేసే గెలిస్తే…అప్పుడు బాలినేని మాటలు కరెక్ట్ కాదని చెప్పొచ్చు. కానీ గత ఎన్నికల్లో పవన్ రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయారు. అది కూడా బి‌ఎస్‌పి, కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుని. ఇప్పుడు బి‌జే‌పితో కలిసి ఉన్నారు…రానున్న రోజుల్లో టి‌డి‌పితో పొత్తు అంటున్నారు. అంటే నెక్స్ట్ కూడా పవన్…ఏదొక పార్టీతో పొత్తులోనే బరిలో దిగుతారు. ఇక గెలుస్తారా? లేదా అనేది తర్వాత అంశం.

ఇటు టి‌డి‌పి కూడా ఎప్పటికప్పుడు…ఏదొక పార్టీతో పొత్తు లేకుండా ఎన్నికల బరిలో దిగదు. పాపం గత ఎన్నికల్లోనే ఒంటరిగా పోటీ చేసి చిత్తుగా ఓడింది. మరి వచ్చే ఎన్నికల్లో బాబు, పవన్‌ని కలుపుకుని బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అంటే బాలినేని మంచి పాయింట్లే చెప్పారని అనుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news