చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్ ప్రత్యర్ధి..భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్..పవన్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. చాలా కాలం నుంచి మీడియాలో పెద్దగా కనబడని గ్రంథి..తాజాగా భీమవరంలో పవన్ సభ ఉండటంతో ఎంట్రీ ఇచ్చి విమర్శలు చేశారు. భీమవరంలో ఎంతమంది ఓటర్లు ఉంటారు? ఎన్నిక విధానం లాంటివి కూడా పవన్‌కు తెలియదని ఎద్దేవా చేశారు.
గోదావరి జిల్లాల్లో రౌడీయిజం అనేది పెద్ద జోక్ అని, ఇక గతంలో చిరంజీవి కూతురు శ్రీజ తన బాబాయ్ వల్ల ప్రాణ హాని ఉందని చెప్పిన విషయం, ఆ సమయంలో గన్ పట్టుకుని పవన్ రౌడిగా వ్యవహరించిన తీరు ప్రజలు మర్చిపోలేదని గుర్తు చేశారు. ఇలా గతంలో విషయాలని చెప్పి మరీ గ్రంథి విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో ఏదో జగన్ గాలిలో గెలిచిన గ్రంథి..ఈ సారి ఎలా గెలుస్తారో చూస్తామని జనసేన శ్రేణులు సవాల్ విసురుతున్నాయి. ఎలాగో సీటు కూడా దక్కేలా లేదని, అందుకే మీడియా ముందుకొచ్చి పవన్‌ని తిట్టే కార్యక్రమం చేస్తున్నారని, అలా చేస్తే సీటు వస్తుందని ఆశ పడుతున్నారని అన్నారు.
st
అయితే సరైన పనితీరు లేని ఎమ్మెల్యేల్లో గ్రంథి శ్రీనివాస్ కూడా ఉన్నారని తెలిసింది. ఆయనకు జగన్ ఇప్పటికే క్లాస్ ఇచ్చారని, ఒకవేళ సీటు ఇచ్చిన నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడం అనేది అసాధ్యమని తెలుస్తుంది. పవన్ ఖచ్చితంగా భీమవరంలో పోటీ చేస్తారని, ఒకవేళ ఆయన పోటీ చేయకపోయిన జనసేన అభ్యర్ధి చేతిలోనే గ్రంథి ఓడిపోతారని అంటున్నారు.
గత ఎన్నికల్లో గ్రంథికి వైసీపీ నుంచి పోటీ చేసి 70 వేల ఓట్లు వచ్చాయి. అటు పవన్‌కు 62 వేలు రాగా, టిడిపికి 54 వేలు వచ్చాయి. ఈ సారి పొత్తు లేకపోయినా ఇక్కడ పవన్ సులువుగా గెలుస్తారని తెలుస్తుంది. టిడిపితో పొత్తు ఉంటే భారీ మెజారిటీ ఖాయమని చెప్పవచ్చు. మొత్తానికైతే గ్రంథికి సీటు దక్కడం ఒక టాస్క్..సీటు దక్కిన గెలుపు గగనమే.