రాజకీయాల్లో ఏదో సాధించాలనే తపన పవన్ కల్యాణ్ లో ఎక్కువ ఉంది..అందుకే జనసేన పార్టీ పెట్టి…ప్రజల కోసం అండగా నిలబడాలని మొదట నుంచి కష్టపడుతూనే ఉన్నారు…అధికారంలో లేకపోయినా సరే..ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఎంత చేసిన బలంగా ఉన్న వైసీపీ-టీడీపీలతో పోలిస్తే జనసేన బలం ఏ మాత్రం పెరగడం లేదు. ఏపీ ప్రజలు జనసేన వైపు ఎక్కువ మొగ్గు చూపడం లేదు. అయితే వైసీపీ లేకపోతే టీడీపీ అన్నట్లు ఉన్నారు.
ఈ రెండు పార్టీలని కాదని జనసేన వైపుకు తక్కువ మంది చూస్తున్నారు…దీని వల్ల జనసేనకు గెలిచి అధికారంలోకి వచ్చేంత బలం రావడం లేదు. అసలు చెప్పాలంటే పట్టుమని పది సీట్లు గెలుచుకునే బలం జనసేనకు రావడం లేదు. అంటే జనసేన సింగిల్ గా పోటీ చేస్తే…ఆ పార్టీకి వచ్చే ఓట్ల శాతం కూడా సింగిల్ డిజిట్ గానే ఉంటుంది…అయితే 6-8 శాతం లోపే జనసేనకు ఓట్లు పడేలా ఉన్నాయి.
ఈ ఓట్లతో జనసేనకు అధికారం దక్కదు…అభిమానులు, పార్టీ శ్రేణులు అనుకున్నట్లు పవన్ సీఎం కాలేరు. మరి జనసేన బలం ఎప్పుడు పెరుగుతుందనేది క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం ఏపీ ప్రజలు వైసీపీ-టీడీపీలని దాటి జనసేన వైపు చూసే పరిస్తితి కనిపించడం లేదు. ఇటీవల వస్తున్న పలు సర్వేల్లో అదే విషయం రుజువు అవుతుంది.
తాజాగా వచ్చిన ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో…అసలు జనసేనకు ఒక్క సీటు కూడా దక్కలేదు. వైసీపీకి 18 ఎంపీ సీట్లు, టీడీపీకి 7 ఎంపీ సీట్లు దక్కుతాయని చెప్పింది. ఏపీలో జనసేన కష్టాల్లో ఉందని సర్వే చెబుతుంది. అంటే క్షేత్ర స్థాయిలో టీడీపీ-వైసీపీలకు ఉన్నట్లు జనసేనకు బలమైన నాయకత్వం, బలమైన కేడర్ లేకపోవడమే జనసేనకు పెద్ద మైనస్. కేవలం పవన్ ఇమేజ్ పైనే పార్టీ ఆధారపడి ఉంది. ఇది ఇలాగే కొనసాగితే…ఇప్పటిలో జనసేన బలపడే అవకాశాలు కనిపించడం లేదు.