టీఆర్ఎస్‌లో రచ్చ: ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే?

-

అధికార పార్టీల్లోకి సాధారణంగానే జంపింగులు ఎక్కువగా ఉంటాయి. అధికారం కోసం ఆశపడి నాయకులు పెద్ద ఎత్తున అధికార పార్టీల్లోకి వస్తారు. ఇలా నాయకులు రావడం వల్ల, పార్టీలో ఆధిపత్య పోరు కూడా ఎక్కువైపోతుంది. దీని వల్ల అధికార పార్టీకే నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కరెక్ట్‌గా ఉమ్మన్దీ ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గంలో ఇదే పరిస్తితి ఉన్నట్లు కనిపిస్తోంది. మొదట నుంచి ఇక్కడ టీఆర్ఎస్ ( Trs Party ) జంపింగ్ ఎమ్మెల్యేలనే నమ్ముకుంది.

TRS-Party | టీఆర్ఎస్

2014లో పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పుడు పాయం వైసీపీ తరుపున గెలిచారు. ఆ తర్వాత కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా పాయం టీఆర్ఎస్‌లో చేరారు. ఇక 2018 ఎన్నికల్లో పాయం టీఆర్ఎస్ తరుపున బరిలో దిగారు. కాంగ్రెస్ తరుపున రేగా కాంతారావు పోటీ చేశారు. టీడీపీ, కమ్యూనిస్టులతో కూడా పొత్తు ఉండటంతో కాంతారావు మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు.

అయితే కాంతారావు మధ్యలో కాంగ్రెస్‌కి షాక్ ఇచ్చేశారు. మళ్ళీ కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా కాంతారావు కాంగ్రెస్‌ని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. అదేం అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు చెప్పారు. మరి అప్పటినుంచి అభివృద్ధి ఏం జరిగిందో పినపాక ప్రజలకే తెలియాలి.

ఈ విషయాన్ని పక్కనబెడితే ఎన్నికల్లో ఓడిపోయాక సైలెంట్ అయిన పాయం వెంకటేశ్వర్లు, ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరుగుతున్నారు. తన వర్గాన్ని మళ్ళీ బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అలాగే నెక్స్ట్ ఎన్నికల్లో సీటు దక్కించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు రేగా కాంతారావు కూడా దూకుడుగానే ఉంటున్నారు. దీంతో నియోజకవర్గంలో ఆధిపత్య పోరు మొదలైంది. ఇక వచ్చే ఎన్నికల్లో ఇద్దరిలో సీటు ఎవరికి వచ్చిన, మరొకరి వర్గం సహకరించే పరిస్తితి ఉండదు. దీంతో మళ్ళీ పినపాకలో టీఆర్ఎస్‌కు ఇబ్బందికర పరిస్తితులు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version