మస్ట్ రీడ్: పెద్దలను పిచ్చోళ్లను చేసిన పవన్!

-

ఎప్పుడు ఏమి మాట్లాడాలి.. ఎక్కడ ఎలా మాట్లాడాలి.. ఎవరితో ఎలా మాట్లాడాలి.. ఏ విషయంపై ఎప్పుడు మాట్లాడాలి.. ఇలాంటి విషయాలు తెలియకపోతే బ్రతుకు బస్టాండ్ అయిపోతుంది! ఈ విషయాలు పవన్ కి తెలియనివి కాదు కానీ… తెలిసిన వ్యక్తిలా మాట్లాడటం మాత్రం రావడం లేదు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం టోటల్ ఇండస్ట్రీని బలిచేసేపనికి పూనుకున్నారు!

తాజాగా జరిగిన సాయిధరం తేజ్ “రిపబ్లిక్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మైకందుకున్న పవన్… గాడితప్పిన ప్రసంగం – అసందర్భ ప్రేలాపనలు చేశారనే కామెంట్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్.

అవును… ప్రస్తుతం ప్రభుత్వానికి – టాలీవుడ్ పెద్దలకు చర్చలు జరుగుతున్నాయి. చిరంజీవి సారధ్యంలోని టాలీవుడ్ పెద్దలు ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నారు. ప్రభుత్వంతో అత్యంత చాకచక్యంగా చర్చలు జరుపుతున్నారు. జగన్ సర్కారుకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో కొంతమంది పెద్దలను సైతం పక్కనపెట్టి మరీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఫలితంగా దాదాపు చర్చలు కొలిక్కి వచ్చేశాయి.

సరిగ్గా ఈ సమయంలో పవన్ మైకందుకున్నారు! వ్యవహారాన్ని మొత్తం మొదటికి తీసుకొచ్చారు. టాలీవుడ్ లో సినిమా టికెట్ల వ్యవహారంపై స్పందించాలనుకుంటే అందుకు వేరే వేదికలు ఉన్నాయి. అవసరమైతే తన అన్న చిరంజీవితో మాట్లాడి… “అన్నా జగన్ తో ఇలా మాట్లాడు – అలా మాట్లాడు – దీనికి ఒప్పుకో – దానికి ఒప్పుకోకు” అంటూ సూచనలు కూడా చేయవచ్చు. పవన్ చెబితే జగన్ ని కలిసిన ఇండస్ట్రీ పెద్దలు అందరూ వినేవారే!

కానీ… పవన్ అలా చేయలేదు. రాజకీయ వేదికలపై పవన్ స్పీచ్ లను జగన్ సర్కార్ ఏనాడూ సినిమా ఇండస్ట్రీ మనిషి మాటల్లా భావించలేదు. వాటిని కేవలం రాజకీయ ప్రసంగాలుగానే, రాజకీయ విమర్శలుగానే భావించింది. కానీ… జనసేన అధినేత ముసుగులో టాలీవుడ్ హీరోగా పవన్ చేసిన తాజా వ్యాఖ్యలు మాత్రం.. ఇండస్ట్రీతో ప్రభుత్వానికున్న మంచి సంబందాన్ని కెలికి పారేశాయి! ప్రస్తుతం టాలీవుడ్ జనాలు ఈ విషయలపైనే తీవ్రంగా చర్చిస్తున్నారంట!

అంతా సెట్ అయిందని ఇండస్ట్రీ పెద్దలు కూడా తమలో తాము సంతోషిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే గాంధీ జయంతి తర్వాత అపాయింట్ మెంట్ తీసుకొని జగన్ వద్ద టాలీవుడ్ అంశాన్ని లేవనెత్తాలనుకున్నారు పేర్ని నాని. అంతలోనే టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్… పేర్ని నానిని సన్నాసి అన్నారు.. జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.! ఫలితంగా ఏపీ సర్కార్ తో చర్చలు జరుపుతున్న టాలీవుడ్ పెద్దలను పిచ్చోళ్లను చేశారు!

ఇక్కడ పవన్ ఆలోచించుకోవాల్సింది ఒకటే! తనకు తాను మైకట్టుకుని జగన్ సర్కార్ నిర్ణయాలను వ్యతిరేకించినంతమాత్రాన్న… ఇండస్ట్రీకి ఏమీ ఒరిగిపోదు! టిక్కెట్ రేట్ల విషయంలో జగన్ సర్కార్ వెనక్కి తగ్గదు! కానీ.. ఇలా మాట్లాడటం వల్ల.. టాలీవుడ్ పెద్దలు జరుపుతున్న వ్యవహారం మాత్రం చెడిపోతుంది. ఫలితంగా ఇండస్ట్రీ బలిపశువు అవుతుంది!

Read more RELATED
Recommended to you

Latest news