సినీ వేదికపై పవన్ రాజకీయ ప్రసంగంతో మొదలైన “పవన్ – పేర్ని నాని వార్” అవిరామంగా కొనసాగుతుంది. పవన్ కెలకటం – నాని గట్టిగా ప్రతిస్పందించడం అనేది రెండు రోజులుగా రొటీన్ వ్యవహారం అయిపోయింది! అయితే ఈ విషయంలో నువ్వొకటంటే… మేము పది మాటలంటా అనే రీతిలో వైసీపీ నేతలు రంగంలోకి దిగిపోతున్నారు. అయితే తాజాగా ఈ వ్యవహారం వ్యక్తిగత విమర్శలవరకూ వెళ్లింది.
పవన్ నోటినుంచి “సన్నాసి” అనే మాట వచ్చిన అనంతరం… తనదైన శైలిలో స్పందించారు మంత్రి పేర్ని నాని. తన సహజశైలికి భిన్నంగా పవన్ ను చాకిరేవెట్టేశారు! అయితే… ఆ వ్యవహారం ఇక సద్దుమణిగినట్లేనేమోలే అని అనుకుంటున్న దశలో… సబ్జెక్ట్ వదిలేసి వ్యక్తిగత విమర్శలు మళ్ళీ మొదలెట్టారు పవన్. ఫలితంగా… నానీ కూడా ట్విట్టర్ పిట్టకు పనిచెప్పారు.
అవును… “తుమ్మెదల ఝుంకారాలు.. నెమళ్ల క్రేంకారాలు.. ఏనుగుల ఘీంకారాలు.. వైకాపా గ్రామ సింహాల గోంకారాలు.. సహజమే” అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. దీంతో పాటు “హూ లెట్ ద డాగ్స్ ఔట్స” అనే పాటను కూడా ట్వీట్ చేస్తూ.. ఇది తనకు ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి అంటూ సెటైర్స్ వేశారు! దీంతో పేర్ని నాని కూడా తన క్రియేటివిటీకి పనిచెప్పారు.
“జనం ఛీత్కారాలు.. ఓటర్ల తిరస్కారాలు.. తమరి వైవాహిక సంస్కారాలు.. వరాహ సమానులకు న’మస్కా’రాలు”! అంటూ పవన్ పై ట్వీట్ చేశారు మంత్రి పేర్ని నాని. “గ్రామసింహాలు” అని పవన్ అంటే… “వరాహ సమానులు” అని పేర్ని నాని అన్నారన్నమాట! దీంతో… ఈ వార్ ఇప్పట్లో ఆగేది కాదని. పవన్ తగ్గితేనే నాని తగ్గుతారు తప్ప… పవన్ తగ్గనంతసేపు నానీ తగ్గేదేలే అంటారన్నమాట! మరి ఈ వార్ ఎంతవరకూ వెళ్తుందనేది వేచి చూడాలి!