పీకే టీం గైడెన్స్..వైసీపీకి ట్రైనింగ్..!

-

రాజకీయాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి…కాదు కాదు రాజకీయ నాయకులే దిగజారుస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు నాయకులకు..ఇప్పుడు నాయకులకు చాలా తేడా ఉంది. ఒకప్పుడు హుందా రాజకీయం చేసేవారు, విలువలు పాటించేవారు..ప్రత్యర్ధులపై నిర్మాణాత్మకమైన విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు హుందాతనం పోయింది..విలువలు అసలుకే లేవు..విమర్శలు కాదు..ఏకంగా పచ్చి బూతులే మాట్లాడుతున్నారు.

అటు తెలంగాణ అయిన, ఇటు ఏపీ అయిన అదే పరిస్తితి. అయితే ఇక్కడ రాజకీయ విశ్లేషకులు ఒక విషయాన్ని ప్రత్యేకంగా చెబుతున్నారు. ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇచ్చారో..అప్పటినుంచి ఇలాంటి రాజకీయం నడుస్తుందని అంటున్నారు. ముఖ్యంగా ఏపీలో..పీకే టీం డైరక్షన్‌లోనే వైసీపీ పనిచేస్తుంది. పీకే స్ట్రాటజీలతోనే గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక ఎలా అధికారంలోకి వచ్చింది..ఎలాంటివి పీకే టీం సృష్టించింది..ప్రత్యర్ధి పార్టీపై ఎలాంటి విమర్శలు చేసిందో అందరికీ తెలిసిందే.

ఇక ఇప్పుడు వైసీపీ రెండోసారి అధికారంలోకి రావడానికి పీకే టీం పనిచేస్తుంది. ఇప్పుడు మరింత ఎక్కువగా రాజకీయాల్లో రచ్చ నడుస్తోంది. నేతలు బూతులుతోనే మాట్లాడుకుంటున్నారు..ఫ్యామిలీలని,. ఆడవాళ్ళని సైతం రాజకీయాల్లోకి దారుణంగా మాట్లాడుతున్నారు. అటు వైసీపీ దీన్ని మొదలుపెడితే..టీడీపీ కూడా అదే బడిలో వెళుతుంది. ఎప్పటిలాగానే పీకే టీం..సరికొత్త సమస్యలని సృష్టించడం..నేతలతో బూతులు తిట్టించడం..మళ్ళీ ప్రత్యర్ధులు కూడా బూతులు తిట్టేలా చేస్తుంది. ఇదే ఏపీలో నడిచే కథ.

ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ వర్క్ షాపులో సీఎం జగన్ సైతం..పీకే టీం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 175 స్థానాల్లో పీకే టీం పనిచేస్తుందని, ఎన్నికలయ్యేవరకు వారు నియోజకవర్గాల్లోనే తిరుగుతూ ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తనకు చేరవేస్తుంటారని, ప్రత్యర్థులపై రాజకీయంగా ఎలా ఎదురుదాడి చేయాలో సూచిస్తూ ఉంటారని.. ప్రతిపక్షాల విమర్శలకు ఎలా అడ్డుకట్ట వేయాలో కూడా నేర్పుతారని.. ప్రెస్‌ కాన్ఫరెన్సుల్లో ఎలా మాట్లాడాలో వివరిస్తారని తెలిపారు. అంటే ఇక్కడ పరోక్షంగా ప్రత్యర్ధి నేతలని ఎలా తిట్టాలో నేర్పించిదే పీకే టీం అని చెబుతున్నారు. అటు టీడీపీలో ఇదే తరహా వ్యవహారం నడుస్తోందని తెలుస్తోంది. మరి ఇలాంటి రాజకీయాలు ఎంతవరకు సమర్ధనీయమనేది ప్రజలకే తెలియాలి.

Read more RELATED
Recommended to you

Latest news