జినోమ్ వ్యాలీకి మోడీ… చంద్రబాబుపై కేటిఅర్ ప్రసంశలు…!

Join Our COmmunity

ప్రధాని నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్ కు వస్తున్న నేపధ్యంలో ఇప్పుడు రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో ఆయన జినోమ్ వ్యాలీని సందర్శించి భారత్ బయోటెక్ అధికారులతో మాట్లాడుతున్నారు. దీనితో జినోమ్ వ్యాలీ గురించే చర్చలు జరుగుతున్నాయి. దేశంలోనే దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. జినోమ్‌ వ్యాలీ అనేది ఆసియాలోనే అతిపెద్ద బయో టెక్నాలజీ అనే విషయం చాలా మందికి తెలియదు.

ఇది జీవ శాస్త్రాల క్లస్టర్‌ గా ఉంది. దాదాపు 18 దేశాలకు చెందిన 200 కంపెనీలు ఇక్కడ తమ విధులు నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి చంద్రబాబు నాయుడు సిఎం గా ఉన్న సమయంలో దీన్ని స్థాపించారు. ఆయన విజన్ తోనే ఇది సాధ్యమైంది అనే విషయం తెలిసిందే. అయితే జినోమ్ వ్యాలీకి సంబంధించి ఇప్పుడు కేటిఅర్ మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

శాసన సభలో మంత్రి కేటిఅర్ మాట్లాడే వీడియో ఒకటి వైరల్ అయింది. కేటీఆర్ అసెంబ్లీ వేదికగా జినోమ్ వ్యాలీ క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడుకు ఇచ్చారు. జినోమ్ వ్యాలీ తాము కట్టామని కాంగ్రెస్ చెప్పగా… మీరు చేయలేదు అని అది చంద్రబాబు నాయుడు చేసారు అని, కచ్చితంగా చంద్రబాబే చేసారని ఆయన అన్నారు. దాన్ని తాము విస్తరిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది. మోడీ పర్యటన నేపధ్యంలో అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేసారు.

TOP STORIES

డేల్యూజనల్ డిజార్డర్ అంటే ఏమిటి.. లక్షణాలు.. కారణాలు.. నయం చేసే వీలు..

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.. కన్న కూతుళ్ళనే పొట్టన పెట్టుకున్న తల్లితండ్రుల మానసిక వైకల్యం గురించి చర్చ జరుగుతుంది....
manalokam telugu latest news