భీమవరం రాజకీయం: పవన్ ప్రత్యర్ధికి రివర్స్ అవుతుందా?

-

గత ఎన్నికల్లో సంచలన తీర్పు వచ్చిన నియోజకవర్గాల్లో భీమవరం కూడా ఒకటి..ఎందుకంటే ఇక్కడ పవన్ కల్యాణ్ పోటీ చేయడం వల్ల రాష్ట్రా వ్యాప్తంగా ఈ నియోజకవర్గం ప్రజల దృష్టిని ఆకర్షించింది. పవన్..గాజువాకతో పాటు భీమవరంలో కూడా పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే రెండుచోట్లా పవన్ అనూహ్యంగా ఓడిపోయారు.

కాకపోతే భీమవరంలో పవన్ గెలుస్తారేమో అని అంతా అనుకున్నారు…కానీ జగన్ గాలిలో ఇక్కడ వైసీపీ తరుపున గ్రంథి శ్రీనివాస్ పోటీ చేసి గెలిచారు. ఇలా పవన్ పై గెలిచి గ్రంథి సంచలనం సృష్టించారు. ఇలా సత్తా చాటిన గ్రంథికి ఇప్పుడు భీమవరంలో ఇంకా పాజిటివ్ ఉందా? అంటే పెద్దగా లేదనే విశ్లేషణలు వస్తున్నాయి. ఎమ్మెల్యేగా అంతగా ప్రజలకు అండగా ఉండటంలో గ్రంథి విఫలమవుతున్నట్లు తెలుస్తోంది.

పైగా ఇక్కడ జనసేన బలం పెరుగుతుంది…అదే సమయంలో నెక్స్ట్ గాని టీడీపీతో పొత్తు ఉంటే…ఈ సీటు ఖచ్చితంగా జనసేనకు దక్కడం, అలాగే విజయం అందుకోవడం ఈజీ అవుతుంది. ఒకవేళ పొత్తు లేకుండా పవన్ పోటీ చేసినా సరే…భీమవరంలో గెలుపు నల్లేరు మీద నడకే అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే నెక్స్ట్ వైసీపీ సీటు గ్రంథికి ఇచ్చే విషయంలో డౌట్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆయన మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో ఉన్నారు..ఈ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరిచారు…దీంతో అసలు సీటుకే ఎసరు వచ్చేలా ఉందని తెలుస్తోంది.

పైగా భీమవరంలో కీలకంగా ఉన్న క్షత్రియ వర్గం ఈయనకు దూరమైందని తెలుస్తోంది. అటు సొంత సామాజికవర్గమైన కాపులు సైతం గ్రంథికి అనుకూలంగా ఉన్నట్లు లేరు…కాపులు పూర్తిగా జనసేన వైపు నిలబడేలా ఉన్నారు. టోటల్ గా చూస్తే భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ కు ఈ సారి అనుకూలమైన వాతావరణం కనిపించడం లేదు. టీడీపీ-జనసేన గాని కలిస్తే డౌట్ లేకుండా గ్రంథికి చెక్ పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news