రేవంత్ ‘యాత్ర’..సీతక్క అడ్డాలో..ఆ స్థానాలే టార్గెట్.!

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. హథ్ సే హథ్ పాదయాత్రలో భాగంగా ఫిబ్రవరి 6 నుంచి రేవంత్ ‘యాత్ర’ పేరిట పాదయాత్ర చేయనున్నారు. గతంలో వైఎస్సార్ ఏ విధంగా ప్రజలని ఆకట్టుకునేలా పాదయాత్ర చేశారో అదే తరహాలో ముందుకెళ్లడానికి రెడీ అయ్యారు. 6 నుంచి ములుగులో రేవంత్ పాదయాత్ర మొదలవుతుంది.

ఇప్పుడుప్పుడే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యలు తగ్గుముఖం పడుతున్న విషయం తెలిసిందే. నేతలంతా ఏకమవుతున్నారు. ఇక పార్టీపై ఫోకస్ చేసి ముందుకెళుతున్నారు. రేవంత్ పాదయాత్రకు సీనియర్లు సైతం ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇక పాదయాత్రతో కాంగ్రెస్ బలం పెంచాలని చూస్తున్నారు. అయితే మొదట ఎక్కడ మొదలవుతుందనే అంశంపై పెద్ద ఎటున చర్చలు నడిచాయి. మొదట భద్రాచలం నుంచి పాదయాత్ర స్టార్ట్ అవుతుందని ప్రచారం మొదలైంది. కానీ తాజాగా సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నుంచి పాదయాత్ర మొదలవుతుందని ప్రకటన వచ్చింది.

కాంగ్రెస్ అధిష్టానం ములుగు నుంచి పాదయాత్ర మొదలుపెట్టాలని ఆదేశాలు ఇవ్వడంపై సీతక్క ధన్యవాదాలు తెలిపారు. ములుగు నుంచి మొదలయ్యే పాదయాత్ర రెండు నెలల పాటు కొనసాగనుంది. రేవంత్ రెండు నెలల పాటు పాదయాత్ర చేయనున్నారు ప్రధానంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలని ఎక్కువ టార్గెట్ చేస్తూ  పాదయాత్ర ముందుకెళుతుందని తెలుస్తోంది.

ఆ నాలుగు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాల్లో ఎక్కువ ఫోకస్ చేసి..బలం మరింత పెంచాలని చూస్తున్నారు. అయితే రెండు నెలలే పాదయాత్ర ఉంటుందా? ఆ తర్వాత కంటిన్యూ అవుతుందా? అనేది క్లారిటీ లేదు. మిగిలిన జిల్లాల్లో కాస్త అసంతృప్తి రావచ్చు. మొదట విడతలో సక్సెస్ అయితే..తర్వాత అధిష్టానంతో మాట్లాడి..రెండో విడత కూడా పాదయాత్ర చేయాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలిసింది. మరి రేవంత్ పాదయాత్రతో కాంగ్రెస్ దశ మారుతుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news