తెలంగాణలో కలెక్టరేట్లపై రేవంత్ రెడ్డి విమర్శలు

-

తెరాస పాలనపై టీపీసీసీ రేవంత్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అన్నివర్గాలు నష్టపోతున్నాయని మండిపడ్డారు. ముఖ్యంగా రైతులు నలిగిపోతున్నారని ఆరోపించారు. తాజాగా రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన నూతన కలెక్టరేట్లపై విమర్శనాస్త్రాలు సంధించారు.

ట్విటర్ వేదికగా కేసీఆర్ పాలనపై రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. పేద ప్రజలను ఆదుకుంటూ.. బాధితుల పక్షాన నిలవాల్సిన కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గులకు కొమ్ముకాస్తోందని విమర్శించారు. ఒకప్పుడు కలెక్టరేట్లు అంటే ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రదేశాలుగా ఉండేవని.. కానీ ఇప్పుడు పరిస్థితులు దారుణంగా మారాయని ట్వీట్ చేశారు.

“తెరాస పాలనలో అందమైన కలెక్టరేట్లు కట్టారు.. కానీ అక్కడ పేదలకు న్యాయం చేయాల్సిన వ్యవస్థలు పతనమయ్యాయని ఆరోపించారు. దాని ఫలితంగా న్యాయం కోసం కలెక్టరేట్ల చుట్టూ తిరిగి విసిగి వేసారిన పేద ప్రజలు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొందని ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. దాంతో ప్రభుత్వ కార్యాలయాలకు, కలెక్టరేట్లకు ఆర్జీలతో రావాల్సిన బాధితులు పెట్రోల్ సీసాలతో వస్తున్నారని” రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news