రేవంత్‌ కు రివర్స్ షాక్…సొంత వర్గమే సెట్ అవ్వట్లేదు!

టి‌పి‌సి‌సి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి పని తీరు ఎలా ఉందంటే…బాగుందని చెప్పేయొచ్చు. ఎందుకంటే మొన్నటివరకు తెలంగాణలో కాంగ్రెస్ అసలు పికప్ అవుతుందా? అనే పరిస్తితి. అసలు కేసీఆర్ దెబ్బకు పార్టీ చాలా నష్టపోయింది. కానీ రేవంత్ రెడ్డి ఎంట్రీతో పూర్తిగా మారిపోయింది. పార్టీకి ఒక్కసారిగా ఊపు వచ్చింది. ఒక్కసారిగా కాంగ్రెస్‌ని రేసులోకి తీసుకొచ్చారు. తన పోరాటాలతో పార్టీని ఇంకా బలోపేతం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్‌లో బడా బడా సీనియర్ నేతలు ఉన్నారు గానీ, రేవంత్ మాదిరిగా ప్రజాకర్షణ నేతలు తక్కువ.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

అందుకే రేవంత్ వల్ల కాంగ్రెస్ పికప్ అవుతుంది. ఇలాంటి సమయంలో రేవంత్‌కు మిగిలిన నేతలు సహకరిస్తే పార్టీ ఇంకా బలపడుతుంది. కానీ కాంగ్రెస్‌లో ఆ పరిస్తితి కనిపించడం లేదు. ఇప్పటికే కొందరు నేతలు రేవంత్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. విచిత్రం ఏంటంటే…మిగిలిన వర్గాలు నేతలు బాగానే రేవంత్‌కు సహకరిస్తున్నారు కానీ..రేవంత్ సొంత సామాజికవర్గమైన రెడ్డి నేతలు మాత్రం పెద్దగా సపోర్ట్ ఇవ్వకపోవడం కాస్త ఇబ్బందిగా మారిందనే చెప్పాలి.

రేవంత్ పి‌సి‌సి అయిన దగ్గర నుంచి ఆ నేతల సహకారం రేవంత్‌కు దొరకడం లేదనే చెప్పాలి. పైగా రేవంత్‌కు వ్యతిరేకంగా వారు ముందుకెళుతున్నారు. మల్లు రవి, షబ్బీర్ ఆలి, దామోదర రాజనర్సింహ, మధు యాష్కి, సీతక్క లాంటి వారు రేవంత్‌కు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే భట్టి విక్రమార్క సైతం రేవంత్‌కు అండగా ఉంటున్నారు. కానీ జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, దామోదర్ రెడ్డి లాంటి వారు రేవంత్‌కు ఏ మాత్రం సహకారం ఇవ్వడం లేదు. పైగా ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. అయితే సొంత వర్గం నేతలే ఇలా చేయడం వల్ల రేవంత్‌కు కాస్త ఇబ్బందే అని చెప్పొచ్చు. ఒకవేళ సహకరించకపోయినా పర్లేదు గానీ డ్యామేజ్ చేయకుండా ఉంటే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ని మంచి పొజిషన్‌లో పెట్టగలరని చెప్పొచ్చు.