రేవంత్ రూట్ చేంజ్..కారు-కమలానికి చెక్ పడేలా?

-

 తెలంగాణ రాజకీయాలు పూర్తిగా టీఆర్ఎస్, బీజేపీల మధ్యే తిరుగుతున్నాయి. ఆ రెండు పార్టీలు మాత్రమే హైలైట్ అవుతున్నాయి. అసలు ఆ రెండు పార్టీలే తెలంగాణలో నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నట్లు రాజకీయం నడుస్తోంది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెనుకబడి ఉన్నట్లు కనిపిస్తోంది. కావాలనే కాంగ్రెస్‌ని దెబ్బతీయడానికే టీఆర్ఎస్, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయని రేవంత్ రెడ్డి అంటున్నారు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

అయితే కాస్త పరిస్తితులు అలాగే ఉన్నా సరే….కాంగ్రెస్ వెనుకబడిన మాట మాత్రం వాస్తవం. ఆ పార్టీ రేసులో వెనుకబడింది. ఈ విషయం రేవంత్‌కు కూడా అర్ధమవుతుంది. పైగా కాంగ్రెస్‌లో నేతల మధ్య రచ్చ నడుస్తోంది. ఈ పరిస్తితుల నేపథ్యంలో రేవంత్ రెడ్డి టోటల్‌గా రూట్ మార్చాలని చూస్తున్నారు. ఇలాగే ముందుకెళితే కారు, కమలం పార్టీలకు ధీటుగా కాంగ్రెస్‌ని నిలబెట్టడం కష్టం. అందుకే ఆయన టోటల్‌గా వేరే రూట్‌లో రానున్నారని తెలుస్తోంది. ఓ వైపు రెండు పార్టీలపై రాజకీయ యుద్ధం తీవ్రం చేయాలని రేవంత్ ప్లాన్ చేసుకున్నారు.

అదే సమయంలో సొంత పార్టీని చక్కదిద్దాలసిన బాధ్యత కూడా రేవంత్‌పై ఉంది. అసలు పార్టీలో పూర్తిగా మార్పులు చేయడానికి రేవంత్ సిద్ధమవుతున్నారు. మొదట టీఆర్ఎస్-బీజేపీలు ఒక్కటే అనే విషయాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఆ తర్వాత పార్టీని సంస్థాగతంగా ఇంకా బలోపేతం చేయాలని చూస్తున్నారు.

ఇదే క్రమంలో మొదట డి‌సి‌సి అధ్యక్షులని మార్చాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. తెలంగాణలో ఉన్న 33 జిల్లాలకు 33 అధ్యక్షులు ఉన్నారు. ఇక వారితో తాజాగా రేవంత్ భేటీ అయ్యారు. అలాగే జిల్లా అధ్యక్షుల పనితీరుపై నివేదికలు తయారు చేసుకున్నారు. అలాగే పనితీరు బాగోని అధ్యక్షులని పక్కన పెట్టేయాలని రేవంత్ డిసైడ్ అయిపోయారు. వారి స్థానాల్లో కొత్త అధ్యక్షులని పెట్టాలని అనుకుంటున్నారు. అలాగే ఆయా నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లని కూడా మార్చాలని రేవంత్ చూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రేవంత్…కాంగ్రెస్‌ని కారు, కమలం పార్టీలకు పోటీగా పెట్టాలని అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news