రోజా జోస్యం: పవన్ ఓటమి..నగరి పరిస్తితి ఏంటి?

-

మంత్రి అయ్యాక రోజా మరింత తీవ్ర స్థాయిలో చంద్రబాబు, పవన్‌లపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అంతకముందు ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా ముద్రవేసుకున్న రోజా..కొన్ని రోజులు మంత్రి పదవి రాలేదని సైలెంట్ గా ఉన్నారు. కానీ పదవి వచ్చాక తనదైన శైలిలో ఫైర్ అవుతున్నారు. అది ఎంతలా అంటే..వాస్తవానికి ఆమె మంత్రి అని అందరికీ తెలుసు..కానీ మంత్రి అంటే చంద్రబాబు, పవన్‌లని తిట్టడానికేనా అన్నట్లు పరిస్తితి. ఎందుకంటే ఆమె ఏ శాఖకు మంత్రిగా ఉన్నారో ప్రజలకు పెద్దగా క్లారిటీ లేదు.

కేవలం బాబు, పవన్‌లని తిట్టేందుకు మంత్రిగా ఉన్నారనుకునే పరిస్తితి. అయితే ఆమె ఇటీవల కాలంలో వరుసపెట్టి మీడియాతో మాట్లాడుతూ..బాబు-పవన్‌లపై విరుచుకుపడుతున్నారు. అలాగే వారిపై ఓ రేంజ్‌లో సెటైర్లు వేస్తున్నారు..ఎగతాళి చేస్తున్నారు. ఇంకా వారికి ప్రజా మద్ధతు లేదని, మొత్తం ప్రజలు అంతా తమ వైపే ఉన్నట్లు మాట్లాడుతున్నారు. తాజాగా అమరావతి అంశంపై సుప్రీం కోర్టు తీర్పుపై స్పందిస్తూ.. రాజధాని విషయంలో సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు తర్వాతైనా అడ్డమైన యాత్రలు ఇకనైనా మానెయ్యాలన్నారు. అధికార వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.

అంటే ఇక్కడ సుప్రీం తీర్పు మూడు రాజధానులకు అనుకూలంగా వచ్చిందనే విధంగా రోజా గాని, వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. సుప్రీం స్టే ఇచ్చింది కేవలం..ఆరు నెలల్లో రాజధాని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనే సుప్రీం స్టే ఇచ్చింది. ఆ విషయం జనాలకు తెలుసు. కానీ ఏదో వైసీపీ నేతలు ఏమార్చడానికి ట్రై చేస్తున్నారు.

అలాగే ‘175 మీరే తెచ్చుకుంటే మేము ఏం చెయ్యాలని పవన్ అంటున్నారని’.. 2019లో రెండు చోట్ల ఓడిపోయినప్పుడు ఏం చేశారో అదే చెయ్యాలన్నారు. చంద్రబాబు, పవన్ ఇద్దరినీ చూసి జనం ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి వచ్చే సీట్లు సున్నా అంటూ జోస్యం చెప్పారు.

అంటే నెక్స్ట్ పవన్ మళ్ళీ ఓడిపోతారని, ఈ సారి టీడీపీకి ఒక్క సీటు కూడా రాదని, 175కి 175 వైసీపీకే వచ్చేస్తాయని రోజా జోస్యం చెబుతున్నారు. ఈ జోస్యం నిజమవుతుందో లేదో జనాలని అడిగితే తెలిసిపోతుందని, పవన్ ఓటమి గురించి తర్వాత ముందు నగరిలో రోజా పరిస్తితి ఏంటో చూసుకోవాలని, సొంతవాళ్లే రోజాని ఓడించడానికి రెడీగా ఉన్నారని టీడీపీ, జనసేన శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news