సబితా-మల్లారెడ్డి డేంజర్ జోన్ లోనే?

-

తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంత టెన్షన్ పడుతున్నాయో తెలియదు గాని…టీఆర్ఎస్ నేతల మాత్రం ఫుల్ టెన్షన్ లో ఉంటున్నారు. టీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేస్తున్న పీకే టీం…ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు నిర్వహించి..ఆ రిపోర్ట్ కేసీఆర్ కు అందిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా సర్వేలు చేశారు. ఇంకా పీకే టీం అదే పనిలో ఉంది. ఇదే క్రమంలో తాజాగా మంత్రుల పనితీరుపై కూడా పీకే టీం సర్వే చేసినట్లు తెలుస్తోంది.

కేసీఆర్ మినహా కేబినెట్ లో…16 మంది మంత్రులు ఉన్నారు…ఇందులో మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్…ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఇక 14 మంది ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులు అయ్యారు. ఇక ఈ 14 మందిలో దాదాపు సగం పైనే మంత్రులు డేంజర్ జోన్ లో ఉన్నారని పీకే సర్వేలో తేలిందట. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రుల పరిస్తితి క్లిష్టంగానే ఉందని తేలింది.

ఉమ్మడి రంగారెడ్డిలో ఇద్దరు మంత్రులు ఉన్న సంగతి తెలిసిందే…మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. ఇందులో సబితా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చి మంత్రి అయిన విషయం తెలిసిందే. ఇలా జంప్ అయ్యి మంత్రి అవ్వడమే సబితాకు మెయిన్ మైనస్ అని తెలుస్తోంది. పైగా సబితా ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. టీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి…సబితాకు యాంటీగానే ఉన్నారు…అవసరమైతే ఆయన పార్టీ మారిపోవాలని చూస్తున్నారు. పైగా ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలపడుతున్నాయి.

అటు మేడ్చల్ లో మల్లారెడ్డి పరిస్తితి ఏమి పెద్ద ఆశాజనకంగా లేదని తెలుస్తోంది…గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి మంత్రి అయ్యారు…కానీ ఈ సారి మాత్రం మల్లారెడ్డికి ఎదురుగాలి వీస్తున్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీలోనే మల్లారెడ్డికి వ్యతిరేకత ఉంది…అలాగే మేడ్చల్ లో కాంగ్రెస్, బీజేపీలు పుంజుకుంటున్నాయి. మొత్తానికైతే సబితా, మల్లారెడ్డి డేంజర్ జోన్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news