అధికారం ఉంది కదా అని ఎడాపెడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గోడ దూకేశారు. అయితే అధికారంలో ఉన్నన్ని రోజులు గోడ దూకిన ఎమ్మెల్యేల పరిస్తితి బాగానే ఉంటుంది…ఒకసారి ఎన్నికల్లో సీన్ రివర్స్ అయితే వారి పరిస్తితి దారుణంగా ఉంటుంది. ఇప్పటికే జంపింగ్ ఎమ్మెల్యేలని ప్రజలు ఆదరించరని…గత ఏపీ ఎన్నికల్లో రుజువైంది…పార్టీ మారిన వారిని ప్రజలు చిత్తుగా ఓడించారు. కానీ తెలంగాణలో జరిగిన 2018 ఎన్నికల్లో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సేవ్ అయ్యారు. తెలంగాణ సెంటిమెంట్ వల్లే వారు సేవ్ అయ్యారు.
ఈ సారి మాత్రం అలాంటి పరిస్తితి ఉండేలా లేదు…జంపింగ్ ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్పేలా లేరు. అయితే ప్రజాతీర్పు కంటే ముందు వారికి అసలు సీట్లు వస్తాయో లేదో కూడా గ్యారెంటీ లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది, టీడీపీకి చెందిన ఇద్దరు, ఇద్దరు ఇండిపెండెంట్లు టీఆర్ఎస్ లోకి జంప్ చేసిన విషయం తెలిసిందే. ఇలా 16 మంది గెలిచిన చోట…ప్రజలు టీఆర్ఎస్ ని ఓడించారు. అంటే టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు.
అయినా సరే వారు ప్రజాతీర్పు గౌరవించకుండా టీఆర్ఎస్ లోకి జంప్ చేశారు. అభివృద్ధి పేరుతో పార్టీ మారిపోయారు. కానీ పార్టీ మారిన సరే నాయకులు అభివృద్ధి చెందారు గాని…ఆయా నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతున్నట్లు కనిపించడం లేదు. ఈ పరిణామాలని బట్టి చూస్తే చాలామంది జంపింగ్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత గట్టిగానే వస్తున్నట్లు కనిపిస్తోంది. అలాంటి జంపింగ్ ఎమ్మెల్యేలకు నెక్స్ట్ కేసీఆర్ సీటు కూడా ఇచ్చేలా లేరు. ఏదేమైనా ఈ సారి జంపింగ్ ఎమ్మెల్యేల పరిస్తితి అయోమయంగానే ఉంది.
ముఖ్యంగా రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు, రాములు నాయక్, గండ్ర వెంకటరమణ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రోహిత్ రెడ్డి ఇలా కొందరు జంపింగ్ ఎమ్మెల్యేలకు సీటు కష్టాలు ఎక్కువ ఉన్నాయి. మొత్తానికైతే జంపింగ్ ఎమ్మెల్యేల్లో కొందరికి నెక్స్ట్ సీటు దొరికేలా లేదు.