తెలంగాణలో ఆ ఫార్ములాను నమ్ముకుంటున్న షర్మిల… కానీ పనిచేయట్లే…

-

తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొస్తానని ఎంట్రీ ఇచ్చిన షర్మిలకు అంతగా కలిసి రావట్లేదనే చెప్పాలి. షర్మిల ఎంట్రీ ఇవ్వడంతోనే కాంగ్రెస్​ పార్టీ రేవంత్​ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించింది. దీంతో ఓ సామాజిక వర్గం ఓట్లు చీలిపోతాయని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అంతే కాకుండా ప్రజెంట్​ చేస్తున్న పనులు కూడా షర్మిలకు అంతగా ఫాలోయింగ్​ తీసుకురాకపోవచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

 

ఇక షర్మిల తీసుకున్న నిర్ణయం కూడా తాను ప్రజలల్లో ఆదరణ పొందకపోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. షర్మిలను అందరూ షర్మిలమ్మ అని సంబోధించాలని పార్టీలో ఉన్న నాయకులకు ఇప్పటికే సూచించారట. కానీ ఈ పదం తెలంగాణ జనాలకు అంతగా కనెక్ట్​ కాదని  పలువురు పెదవి విరుస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఎంత సేపు అన్న, అక్క అనే పదాలు తప్ప, వేరే పదాలు అంతగా సూట్​ కావని చెబుతున్నారు. ఇలా ఈ పరిణామం షర్మిలకు అంతగా మింగుడు పడడం లేదని అంటున్నారు. ఇక షర్మిల చేసిన నిరుద్యోగ దీక్షకు కూడా అంతగా… ప్రజాదరణ దక్కలేదని పలువురు చెబుతున్నారు. ఇలా షర్మిల ఏదో అనుకుని రాజకీయ పార్టీని స్థాపిస్తే మరేదో జరిగిందని పలువురు చెబుతున్నారు. షర్మిల సూచించిన అమ్మ అనే పదం తెలంగాణలో అంతగా సెట్​ కాదని విశ్లేషకులు బల్ల గుద్ది వాదించడం గమనార్హం. పార్టీ పేరును ప్రకటించి దాదాపు 15 రోజులవుతున్నా ఇంత వరకు ఏ ఒక్క బడా నేత కూడా పార్టీలో చేరకపోవడం షర్మిలకు మైనస్​ గా మారుతుందని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news