ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో అన్ని పార్టీలు మంచి జోష్ మీదే కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎవరికి వారు మంచి జోరు కనబరుస్తున్నారు. ఇక పోతే వీరిని తట్టుకుని నిలబడేందుకు వై.ఎస్.షర్మిల ఎంత ట్రై చేసినా పెద్దగా కలిసి రావట్లేదు. ఆమె ఎంట్రీ ఇస్తూనే నిరుద్యోగ ఎజెండాను భుజాన వేసుకున్నా కూడా యూత్ ను ఆకట్టుకోలేకపోతున్నారు. ఆమె వెంట నడిచేందుకు పెద్దగా ఎవరూ ఇంట్రెస్ట్ చూపించట్లేదంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కాగా ఆమె చేస్తున్న పనులతో ప్లస్ అవ్వడం కంటూ కూడా మైనస్ అవుతోంది.
నిరుద్యోగుల తరఫున దీక్షలు చేసి వారిని తనవైపు తిప్పుకుంటే తన పార్టీకి కలిసి వస్తుందని భావించిన షర్మిలకు వరుస షాక్ లు తగులుతున్నాయి. అదేంటో గానీ కలిసి రాకపోగా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. చనిపోయిన నిరుద్యోగుల కుటుంబాలు వద్దకు దీక్షలు చేయడాఇనకి వెళ్తున్న షర్మిలపై ఆ కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ కారణాలతోనే ఆమె ఇలాంటి దీక్షలకు బ్రేక్ వేసేసి కొత్త రూటు ఎంచుకున్నారు.
ఇక ఇండ్ల దగ్గర దీక్షలు చేస్తే లాభం లేదని, ఎవరూ సహకరించట్లేదని గ్రహించిన షర్మిల ఇకపై డైరెక్టుగా యూనివర్సిటీల వద్ద దీక్షలు చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అప్పుడే యూత్ నేరుగా కలిసినట్టు అవుతుందని, వారు తన పార్టీకి మద్దతు ఇస్తారని ఆమె భావిస్తున్నారు.కాగా యూనివర్సిటీల్లో ఏ రోజు పడితే ఆ రోజు చేయడానికి వీలుండదు గనక ప్రతి మంగళవారం ఈ కార్యక్రమం ఉండేలా చూసుకుంటున్నారు. ఇక యూనివర్సిటీల్లో ఉన్న నిరుద్యోగులు చాలా వరకు టీఆర్ఎస్ పార్టీపై ఆగ్రహంతో ఉన్నందున ఈజీగానే తనకు మద్దతు లభిస్తుందని ఆమె అనుకుంటున్నారు. చూడాలి మరి ఏ మేరకు ప్రయత్నం ఫలిస్తుందో.