తెలంగాణలో షర్మిల తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ముందుకెళుతున్నారు…ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే…పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళుతున్నారు. అలాగే నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతున్నారు. ఇక కేసీఆర్ సర్కార్ టార్గెట్‌గా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రతిరోజూ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే వస్తున్నారు. అలాగే పాదయాత్ర చేసే నియోజకవర్గాలకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైనా, మంత్రులపైనా కూడా షర్మిల విరుచుకుపడుతున్నారు.
ప్రస్తుతం ఆమె ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు…ఈ క్రమంలో షర్మిల..ఆ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఈ మధ్య మంత్రి నిరంజన్ రెడ్డిని ఏ విధంగా టార్గెట్ చేసి విమర్శించారో అందరికీ తెలిసిందే. గతంలో నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తున్న షర్మిలని ఉద్దేశించి…నిరంజన్ రెడ్డి మంగళవారం మరదలు ఒకామే బయలుదేరిదని విమర్శించారు. ఇక దీనిపై తాజాగా నిర్ణజన్ రెడ్డికి చెందిన వనపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన షర్మిల కౌంటర్ ఇచ్చింది.
పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడలేని సంస్కారహీనుడు నిరంజన్ రెడ్డి అని, ఆయనకు, కుక్కకు తేడా ఏమైనా ఉందా? అని ఘాటుగా మాట్లాడారు. ఒక మాట అంటే తాము వంద మాటలు అంటామని నిరంజన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాజన్న బిడ్డవైతే మునుగోడులో పోటీ చేసి నీ సత్తా ఏంటో చూపించాలని సవాల్ విసిరారు. ఆ వెంటనే షర్మిల సైతం మళ్ళీ ఫైర్ అయ్యారు. అలాగే ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే…ఆ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫైర్ అవుతున్నారు.
తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై ఫైర్ అయ్యారు. మంత్రి సొంత వూరు రాచాల గురించి మాట్లాడుతూ…సొంత వూరుకు రోడ్డు వేయించుకోలేదని, డబ్బులు సంపాదన మీద ఉన్న సోయి ఈ మంత్రులకు సొంత ఊళ్ళ మీద ఉండదని మండిపడ్డారు. ఇలా షర్మిల…టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు టార్గెట్‌గా ఫైర్ అవుతున్నారు. అయితే షర్మిల వ్యాఖ్యల ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై ఉండటం లేదు. ఏదో స్థానికంగానే ఆమె రాజకీయం ఉంటుంది.