ఆ కమ్మ ఎమ్మెల్యేలని జగనే కాపాడాలా?

గత ఎన్నికల మాదిరిగానే ఈ సారి ఎన్నికల్లో కూడా చాలామంది ఎమ్మెల్యేలని జగనే ఒడ్డున పడేయాలి…తన ఇమేజ్ తోనే పలువురు ఎమ్మెల్యేలు గెలిచే పరిస్తితి. గత ఎన్నికల్లో దాదాపు సగం మంది ఎమ్మెల్యేలు జగన్ ఇమేజ్ వల్లే గెలిచి బయటపడ్డారని చెప్పొచ్చు. అయితే అలా గెలిచిన ఎమ్మెల్యేలు అధికారంలోకి వచ్చాకైనా సొంతంగా బలం పెంచుకునే పనులు పెద్దగా చేసినట్లు లేరు. అలాంటి వారికి నెక్స్ట్ సీటు ఇవ్వకపోవడం లేదా…వారు మళ్ళీ పోటీ చేస్తే వారిని గెలిపించే బాధ్యత జగన్ తీసుకోవాల్సిందే.

అలా జగన్ మీద ఆధారపడే కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున పలువురు కమ్మ ఎమ్మెల్యేలు గెలిచారు. గుడివాడలో కొడాలి నాని, మైలవరంలో వసంత కృష్ణప్రసాద్, దెందులూరులో అబ్బయ్య చౌదరీ, వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు, తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్, పెదకూరపాడులో నంబూరు శంకర్ రావు గెలిచారు. ఇక వీరిలో కొడాలి నానికి తప్పా…మిగతా వారికి సొంత ఇమేజ్ పెద్దగా లేదు.

ఇందులో కొడాలి నానిని పక్కన పెడితే…మిగిలిన వారంతా గత ఎన్నికల్లో తొలిసారి గెలిచిన వారే…అది కూడా టీడీపీ కంచుకోటల్లో ఉన్న బలమైన కమ్మ నేతలని ఓడించినవారే. అయితే ఇదంతా జగన్ ఇమేజ్ వల్లే సాధ్యమైంది. జగన్ ఇమేజ్ వల్లే కమ్మ ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ ఈ సారి ఎన్నికల్లో గెలవడానికి వారికి అవకాశాలు పెద్దగా ఉన్నట్లు లేవు. పైగా కొందరిపై వ్యతిరేకత పెరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ గాని వారికి సీట్లు వస్తే…జగనే వారిని గెలిపించుకోవాలి.

వీరిలో కొద్దో గొప్పో నంబూరు శంకర్ రావు పరిస్తితి బాగానే ఉంది. కానీ మిగిలిన వారి పరిస్తితి అంతగా బాగున్నట్లు కనిపించడం లేదు. జగన్ ఇమేజ్ సైతం వారిని కాపాడటం కష్టమే అని పరిస్తితి ఉంది. చూడాలి మరి ఈ సారి జగన్..ఎంతమంది కమ్మ నేతలని కాపాడతారో.