దుమారం రేపుతున్న ఇమ్రాన్ ఖాన్ పై సిద్ధు వ్యాఖ్య‌లు

-

పంజాబ్ పీసీసీ చీఫ్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దు త‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌ల తో ఎప్పుడూ వార్త‌ల‌లో ఉంటారు. తాజాగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దాయాది దేశం ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ త‌న‌కు పెద్ద అన్న లాంటి వాడ‌ని న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దు అన్నారు. కాగ ఈ వ్యాఖ్య‌లు మ‌న దేశం లో పెద్ద దుమారం రేపుతున్నాయి. కాగ ఇటీవ‌ల పాకిస్థాన్ ప్ర‌భుత్వం తమ దేశంలో ఉన్న సిక్కుల ప‌విత్ర స్థ‌లం క‌ర్తార్ పూర్ కారిడార్ ను ప్రారంభించారు. అయితే ఈ క‌ర్తార్ పూర్ కారిడార్ ను పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధు సంద‌ర్శంచారు.

ఈ సంద‌ర్భంగా పాక్ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. అలాగే పాకిస్థాన్ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ త‌న‌కు పెద్ద అన్న వంటి వాడ‌ని ప్ర‌క‌టించాడు. అయితే ఈ వ్యాఖ్య‌ల పై బీజేపీ నాయ‌కులు తీవ్రంగా స్పందిస్తున్నారు. పాక్ లో ఉన్న ఒక వ‌ర్గం ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించ‌డానికే న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధు తో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయిస్తుంద‌ని బీజేపీ నాయకులు ఆరోపించారు. అంతే కాకుండా ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీ ఐఎస్, బోకోహారం సంస్థ‌ల‌ను హిందుత్వం తో పోల్చింద‌ని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version