హుజూరాబాద్‌లో వింత రాజ‌కీయాలు.. హ‌రీశ్‌రావు అలా.. ఈట‌ల ఇలా..

దేశంలో ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా ఒక సంప్ర‌దాయం ఉంటుంది. అదేంటంటే అక్క‌డ పోటీ చేసే వ్య‌క్తిని చూపించి ఏ పార్టీ అయినా ఓట్లు అడుగుతారు. ఎందుకంటే ఆ నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచిన ఆవ్య‌క్తిపైనే అభివృద్ధి ఆధార‌ప‌డి ఉంటుంది. ప్ర‌జలు కూడా ఆయ‌న్ను విదేయుడిగా భావిస్తారు. కానీ ఇప్పుడు తెలంగాణ‌లో జ‌రుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మాత్రం చిత్ర విచిత్రాలు జ‌రుగుతున్నాయి. ఎందుకంటే ఒక పార్టీ వారేమో అభ్య‌ర్థి పేరుకంటే కూడా అధినేత పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు.

కానీ ఇంకో పార్టీ వారేమో అధినేతను చూడ‌కుండా త‌న‌ను చూసి ఓటేయాలంటూ కోరుతున్నారు. ఇదే ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. అదేంటంటే ఈట‌ల రాజేంద‌ర్ తాను గ‌తంలో హుజూరాబాద్‌కు చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలంటూ కోరుతున్నారు. అంతే గానీ ఎక్క‌డా బీజేపీ పేరును వాడ‌ట్లేదు. ఇంకా చెప్పాలంటే ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలంటూ కూడా అడ‌గ‌ట్లేదు.

ఇదే పెద్ద విచిత్రం అనుకుంటే ఇంకో వైపు టీఆర్ ఎస్ మ‌రో కొత్త వింత రాజీక‌యాలు చేస్తోంది. అదేంటంటే టీఆర్ ఎస్ త‌ర‌ఫున పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ పేరు అస‌లు వార్త‌ల్లో కూడా క‌నిపించ‌ట్లేదు. ఇక హ‌రీశ్‌రావు ప్ర‌చార బాధ్య‌త‌లు మోస్తూ ఆయ‌న వాయిస్ వినిపిస్తున్నారు. కేవ‌లం కేసీఆర్ ను చూసి ఓటెయ్యాలంటూ అడుగుతున్నారు. అంతే గానీ గెల్లు శ్రీనివా స్ అంత‌కు ముందు ఏం చేశారో చెప్ప‌ట్లేదు. పోనీ గెలిస్తే ఏం డెవ‌ల‌ప్ మెంట్ చేస్తారో కూడా చెప్ప‌కుండా ఓట్లు అడగుతున్నారు. మొత్తానికి ఇరు పార్టీలు కూడా విచిత్ర రాజీకాయ‌లు చేస్తున్నాయి.