ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్‌లో చాలా వరకు జోష్ పెరిగిందనే చెప్పాలి. ఆయన రాకతో శ్రేణుల్లో జోష్ పెరగడమే కాకుండా ఇతర పార్టీల్లో కూడా కొంత టెన్షన్ పెరిగిందనే చెప్పాలి. ఇక రేవంత్ కూడా మార్కును చూపించేందుకు పక్కాగా ప్లాన్ వేస్తున్నారు. వరుస పోరాటాలతో దుమ్ములేపుతున్నారు. ఇక ఎలాగైనా టీఆర్ ఎస్ మీద వ్యతిరేకత తీసుకొచ్చే పనిలో భాగంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో కలిసి పక్కాగా ప్లాన్ వేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంద్రవెల్లిలో లక్ష మందితో దళిత, గిరిజన దండోరా బహిరంగ సభను నిర్వహించగా దాని ఇంపాక్ట్ అన్ని రాజకీయ పార్టీల్లో బాగానే పడిందని చెప్పాలి.
ఇక ఈ జోష్ తోనే ఈ దండోరా బహిరంగ సభలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించి దళితులను, గిరజనులను తమ పార్టీవైపు తిప్పుకోవడానికి రేవంత్ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరిన్ని పోరాటాలు చేసేందుకు వరుసగా ప్లాన్ చేసింది. వీటికి వ్యూహ రచన చేసేందుకు గాను రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్స్, అలాగే వైస్ ప్రెసిడెంట్స్‌తో కోర్ కమిటీ మీటింగ్ జరిపి అన్ని విషయాలపై రేవంత్ చర్చించారు.
ఇక రెండో సభను భువనగిరి పరిధిలోని ఇబ్రహీంపట్నంలో ఈ నెల 18న నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇక టీఆర్ ఎస్‌పై వ్యతిరేక తీసుకొచ్చే పనిలో భాగంగా కాంగ్రస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు చేయాని, న్యాయ పోరాటాలకు సిద్ధం కావాలని రేవంత్ సూచించారు. రాబోయే రెండు, మూడు నెలల వరకు రాష్ట్రంలో వరుసగా ఆందోళనలు నిర్వహించేందుకు దిశానిర్దేశం చేశారు. అలాగే రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వారిని ప్రతి సభలో కూడా హైలెట్ చేస్తూ ఇబ్బందులను అధిగమించాలని రేవంత్ ప్లాన్ చేశారు.