తాలిబన్లు ఉగ్రవాదులే.. ఎట్టకేలకు అమెరికా ఒప్పుకోలు

-

రెండు దశాబ్ధాల ప్రజాపాలనను గద్దె దించి తాలిబన్లు ఆప్గనిస్థాన్ ను హస్తగతం చేసుకున్నారు. అమెరికా మద్దతుతో రెండు దశాబ్ధాలుగా ఉన్న ప్రజాప్రభుత్వం తాలిబన్ల దాటికి తట్టుకోలేకపోయింది. వైదోలిగే సమయంలో అమెరికా, తాలిబన్లతో ఖతార్ లో చర్చలు జరిపింది. అన్ని వర్గాల వారికి పాలనలో భాగస్వాయ్యం ఇవ్వాాలని అమెరికా కోరింది. అయితే తాలిబన్లు వీటన్నింటిన తుంగలో తొక్కారు. చర్చల అనంతరం ఆప్గనిస్తాన్లో అమెరికా ప్రాబల్యం ఉంటుందని అమెరికా అనుకున్నప్పటికీ చైనా, పాక్ చెప్పుచేతుల్లోకి క్రమంగా తాలిబన్లు వెళుతున్నారు. ఇన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న అమెరికా తాలిబన్లను ఉగ్రవాదులే అని స్పష్టం చేస్తుంది. తాజాగా అమెరికా రక్షణ శాఖ తాలిబన్లు గతంలో ఉగ్రవాదులే ఇప్పుడు కూడా ఉగ్రవాదులే అని ప్రకటించింది. ఇటీవల కాలంలో తాలిబన్లు ఆప్గన్ ప్రజల స్వేచ్చను హరిస్తున్నారు. షరియా చట్టం పేరుతో రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. గతంలో అమెరికాకు అనుకూలంగా వ్యవహరించిన ప్రజలను చంపేలా ప్లాన్ చేస్తున్నారు. తాలిబన్ అధినాయకత్వం ప్రజలకు ఇబ్బందులు ఉండవని చెబుతున్నప్పటికీ కిందిస్థాయి తాలిబన్లు తమ అరాచకాలు కొనసాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news