కలిసిన వారందరితో పొత్తు ఉండదు..సోము క్లారిటీ..పవన్ తేల్చుకోవాలి!

-

ఏపీలో పొత్తుల అంశంపై ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. చివరికి ఏ పార్టీ ఏ పార్టీతో ముందుకెళుతుందో అర్ధం కాకుండా ఉంది. అయితే పొత్తుల అంశంలో జనసేన, బి‌జే‌పి నేతలే మీడియాతో ఎక్కువ మాట్లాడుతున్నారు. కానీ అసలు టి‌డి‌పి నేతలు ఈ పొత్తుల అంశంపై క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసుకుంటామని, ఎన్నికల సమయంలోనే పొత్తుల గురించి మాట్లాడతామని అంటున్నారు.

ఇటు జనసేన అధినేత పవన్ ఏమో తాజాగా ఢిల్లీకి వెళ్ళి బి‌జే‌పి పెద్దలని కలిశారు. ఈ క్రమంలో 2014 ఎన్నికల మాదిరిగా టి‌డి‌పి-బి‌జే‌పి‌-జనసేన కలిసి 2024 ఎన్నికల్లో ముందుకెళ్లె ప్రతిపాదన బి‌జే‌పి పెద్దల ముందు పెట్టారట..వైసీపీని గద్దె దించడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండే అంశాలపై మాట్లాడినట్లు తెలిసింది. కానీ టి‌డి‌పితో పొత్తుపై బి‌జే‌పి పెద్దలు మాట్లాడలేదట. బి‌జే‌పిని సొంతంగా బలోపేతం చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అందులో జనసేన కలిసి రావాలని అన్నారట.

అంటే టి‌డి‌పితో పొత్తుపై క్లారిటీ రాలేదు. తాజాగా ఏపీ బి‌జే‌పి అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం పొత్తుపై మాట్లాడారు. జనసేన, బీజేపీ కలిసే ఉన్నాయని.. కలిసే ముందుకు వెళతామని, ఈ ప్రభుత్వం పై ఇద్దరం కలిసి ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భవిష్యత్తులో కూడా జనసేన, ‌బీజేపీ కలిసే ప్రయాణం చేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే రాజకీయ అవసరాల‌ కోసం సహజంగా అనేక పార్టీ నేతలను కలుస్తామని.. గతంలో చంద్రబాబును కూడా రాష్ట్రపతికి మద్దతు ఇచ్చిన సమయంలో కలిశామని.. అలా కలిసిన వారందరితో పొత్తు ఉన్నట్లు కాదని అన్నారు.

అంటే టి‌డి‌పితో పొత్తు లేదనే చెబుతున్నారు. దీంతో పవన్ అసలు పొత్తు విషయం తేల్చుకోవాలి..బి‌జే‌పిని వదిలేసి..టి‌డి‌పితో పొత్తు పెట్టుకోవడమా..లేక బి‌జే‌పిని ఒప్పించి టి‌డి‌పితో పొత్తు పెట్టుకోవడమనేది చేయాలి. చూడాలి చివరికి ఎవరు పొత్తు పెట్టుకుంటారో.

Read more RELATED
Recommended to you

Latest news