సోలో ‘సైకిల్’: ఆ తమ్ముళ్ళకి పవన్ కావాల్సిందే?

-

మొత్తానికి పవన్ కల్యాణ్…తన పొత్తు ప్రజలతోనే అని చెప్పి…ఇంకా పొత్తు రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టారనే చెప్పొచ్చు. మొన్నటివరకు ఆయన వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి మూడు ఆప్షన్స్ ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చారు. మరి సడన్ గా ఏమైందో తెలియదు గాని…పొత్తు ప్రజలతోనే ఉంటుందని చెప్పేసి..సింగిల్ గా బరిలో దిగడానికి సిద్ధమవుతున్నట్లు హింట్ ఇచ్చారు…ఎలాగో బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి..ఆ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్ళే ఛాన్స్ ఉంది.

అయితే పొత్తు ఉంటే పవన్ ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని చెప్పి జనసేన శ్రేణులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే..ఈ క్రమంలోనే తాము సోలో గానే ఫైట్ చేసి వైసీపీని నిలువరిస్తామని, వార్ వన్ సైడ్ అయిందని చెప్పి టీడీపీ శ్రేణులు మాట్లాడాయి. మరి టీడీపీ శ్రేణులు అలా అనేసరికి పవన్…ఎవరితోనూ పొత్తు లేదన్నట్లు చెప్పుకొచ్చేశారు. సరే జనసేనతో పొత్తు లేకపోతే ఎంతోకొంత టీడీపీకి నష్టం జరుగుతుందని చెప్పొచ్చు. గత ఎన్నికల్లోనే ఆ విషయం అర్ధమైంది.

మరి అలాంటప్పుడు పొత్తు లేకుండా టీడీపీ సత్తా చాటగలదా? అంటే వైసీపీ వ్యతిరేక ఓట్లు కేవలం టీడీపీకి వస్తే ఇబ్బంది ఉండదు…అందులో జనసేన కూడా వాటా పంచుకుంటే రిస్క్ ఎక్కువ. అయితే ఆ రిస్క్ ఉండకూడదు అనుకుంటే ఎంతోకొంత టీడీపీ తగ్గి, జనసేనతో కలిసి ఎన్నికలకు వెళితే బెటర్ అని కొందరు తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల తమ్ముళ్ళు…పవన్ తో కలిసి ముందుకెళితే బెటర్ అంటున్నారు. గత ఎన్నికల్లో జనసేన ఎక్కువ ఓట్లు తెచ్చుకుంది..ఈ మూడు జిల్లాల్లోనే…జనసేన ఎక్కువ ఓట్లు చీల్చడం వల్ల టీడీపీకి బాగా నష్టం జరిగింది.

అయితే నెక్స్ట్ కూడా పొత్తు లేకపోతే..ఈ మూడు జిల్లాల్లో టీడీపే బాగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జనసేనతో సర్దుకుని ఎన్నికలకు వెళితేనే టీడీపీకి అడ్వాంటేజ్ లేదంటే ఇబ్బందే.

Read more RELATED
Recommended to you

Latest news