అక్కడ సైకిల్ మళ్ళీ అస్సామేనా?

-

ఏపీలో సైకిల్ దూసుకెళుతుందని, రాబోయే రోజుల్లో టీడీపీదే అధికారమని, ఆ పార్టీ నేతలు గట్టిగానే చెబుతున్నారు.. ఇక జగన్ పని అయిపోయిందని, వైసీపీని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎప్పుడు ఎన్నికలు జరిగిన వైసీపీ ఓటమి ఖాయమని టీడీపీ నేతలు చెబుతున్నారు.. అసలు టీడీపీకి ప్రజల్లో ఆదరణ పెరిగిపోయిందని, ఇంకా టీడీపీని ఎవరూ ఆపలేరని అంటున్నారు. సరే టీడీపీకి ఆదరణ పెరిగితే..వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోగలదు..మరి నిజంగా టీడీపీ నేతలు చెప్పేది కరెక్టేనా అంటే…ఏమో చెప్పలేని పరిస్తితి.

వాస్తవానికి అధికార వైసీపీపై ప్రజా వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవమే…అలాగే టీడీపీ పుంజుకుంది కూడా…కానీ అది అధికారం మారిపోయేంత కాదని చెప్పొచ్చు…ఇప్పటికీ వైసీపీకి ఎడ్జ్ కనిపిస్తోంది…వైసీపీని ఇంకా వీక్ చేయాలంటే టీడీపీ ఇంకా కష్టపడాలి..అసలు చెప్పాలంటే చాలా నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్తితి ఇంకా దారుణంగానే ఉంది.. ఇక టీడీపీ పరిస్తితి దారుణంగా ఉన్న నియోజకవర్గాల్లో పాణ్యం ఒకటి..ఇక్కడ టీడీపీ గెలిచి చాలా ఏళ్ళు అయింది…అసలు ఇక్కడ టీడీపీకి పెద్ద స్కోప్ లేదు. ఎప్పుడో 1999 ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ గెలిచింది….అంతే మళ్ళీ ఇక్కడ పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూనే వస్తుంది.

వరుసగా అభ్యర్ధులు మారుతూ వస్తున్న ఫలితం ఉండటం లేదు…2004 నుంచి 2019 వరకు వరుసగా నలుగురు అభ్యర్ధులు మారారు..అయిన ప్రయోజనం లేకుండా పోయింది..ఇక చాలా ఏళ్ల తర్వాత శ్రీశైలంలో ఒక అభ్యర్ధి టీడీపీ తరుపున రెండోసారి బరిలో దిగనున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన గౌరు చరితా రెడ్డి..మరొకసారి పాణ్యం బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు.

మరి ఈ సారి చరితా రెడ్డికి గెలిచే అవకాశాలు ఉన్నాయా? అంటే ఏమో చెప్పలేని పరిస్తితి..అపోజిట్ లో కాటసాని రామ్ భూపాల్ రెడ్డి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు..ఆయన ఇప్పటికే ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు…పార్టీలకు అతీతంగా అక్కడ ఆయనకు ఫాలోయింగ్ ఉంది..కాబట్టి ఈ సారి కూడా పాణ్యంలో కాటసానిడే పైచేయి అయ్యేలా ఉంది…మళ్ళీ పాణ్యంలో సైకిల్ నిలబడేలా కనిపించడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news