పవన్ కోసం టీడీపీలో ఖాళీలు?

-

ఏదేమైనా రాజకీయాల్లో చంద్రబాబు తెలివి వేరు అని చెప్పొచ్చు…అవసరాన్ని బట్టి, పరిస్తితులని బట్టి బాబు ఎలాగైనా రాజకీయం నడిపించేయగలరు…అవసరం కోసం ఏ స్థాయికైనా బాబు వెళ్తారు. చివరికి గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తారు. అంటే విజయం సాధించడం కోసం బాబు ఏదైనా చేస్తారు. ఇక వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం బాబు ఇప్పుడు ఏ స్థాయిలో పనిచేస్తున్నారో తెలిసిందే.

తనకు కలిసొచ్చిన ప్రతి అంశాన్ని వాడుకుని రాజకీయంగా బలపడాలని బాబు ప్లాన్ చేసుకుంటున్నారు…అలాగే అవసరాలకు తగ్గట్టుగా బీజేపీ, పవన్ లతో జట్టు కట్టేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే పైకి పొత్తు గురించి మాట్లాడకపోయినా బాబు మాత్రం దూర దృష్టితో…పొత్తు ఉండే విధంగానే ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే పొత్తు ఉంటే కొన్ని సీట్లు జనసేనకు కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఎప్పటినుంచో పొత్తు కోసం..కొన్ని సీట్లని బాబు ఖాళీగా వదిలేయడం…లేదా డమ్మీ ఇంచార్జ్ లని పెట్టడం చేశారు.

ఎన్నికల సమయంలో ఆ సీట్లు జనసేనకు కేటాయించడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. అలా జనసేన కోసం టీడీపీ ఖాళీగా ఉంచిన సీట్లు కొన్ని ఉన్నాయి. కృష్ణా జిల్లాలో విజయవాడ వెస్ట్, కైకలూరు నియోజకవర్గాల్లో టీడీపీలో పూర్తి స్థాయిలో ఇంచార్జ్ లని పెట్టలేదు. అటు అవనిగడ్డ స్థానంలో కూడా టీడీపీ నాయకులకు క్లారిటీ ఇవ్వడం లేదు. పశ్చిమ గోదావరికి వస్తే…భీమవరం, నరసాపురం, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, పోలవరం, చింతలపూడి లాంటి సీట్లలో టీడీపీకి సరైన నాయకులు లేరు.

తూర్పు గోదావరికి వస్తే…కాకినాడ రూరల్, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం సీట్లలో టీడీపీకి బలమైన నాయకులు కనిపించడం లేదు. విశాఖలో భీమిలి, విశాఖ ఉత్తరం సీట్లు జనసేనకు ఇచ్చేయోచ్చని తెలుస్తోంది. ఇవే కాకుండా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన నాయకులని పెట్టలేదు. దీని బట్టి చూస్తే పొత్తు ఉంటుందనే దూర దృష్టితోనే బాబు…జనసేన కోసం సీట్లు ఖాళీగా పెట్టారని అర్ధమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news