కారుని నిలబెడుతున్న మాజీ తమ్ముళ్ళు…!

-

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సగానికి సగం నేతలు టీడీపీ నుంచి వచ్చిన వారే..ఇంకా చెప్పాలంటే తెలంగాణలో టీడీపీ బలమంతా టీఆర్ఎస్ పార్టీకి వచ్చేసింది. ఆ పార్టీలోని నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ వైపు వచ్చేశారు. అసలు కేసీఆర్ టీడీపీ నుంచి వచ్చిన నేతే. సగం మంత్రులు, ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వచ్చిన వారే. అంటే టీడీపీ నేతల వల్లే టీఆర్ఎస్ ఇంకా స్ట్రాంగ్ అయిందని చెప్పొచ్చు.

అయితే తెలంగాణలో టీడీపీ కనుమరుగై, టీఆర్ఎస్ పార్టీకి కొత్త బలం ఇచ్చింది. కానీ ఇప్పుడున్న పరిస్తితుల్లో టీఆర్ఎస్ పార్టీకి కష్టాలు పెరిగాయి…బీజేపీ బలపడుతున్న నేపథ్యంలో…కారు పార్టీకి నెక్స్ట్ గెలుపు అవకాశాలు తగ్గుతున్నాయి. ఎన్నికల నాటికి బీజేపీ ఇంకా బలపడితే టీఆర్ఎస్ పార్టీకి చుక్కలు కనిపించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బీజేపీ బలం పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి..ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ చెక్ పెడుతుందని తేలింది.

కానీ కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ ఇంకా బలంగా ఉంది…దానికి కారణం టీఆర్ఎస్ లో ఉండే నాయకులు అని చెప్పొచ్చు. ముఖ్యంగా టీడీపీ నుంచి వచ్చిన నేతలు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో వారు టీఆర్ఎస్ పార్టీకి కీలకమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా టీడీపీ నుంచి స్ట్రాంగ్ గా ఉన్న నేతల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఉన్నారు. వీరు దశాబ్దాల పాటు టీడీపీలో పనిచేసి…2014లో టీడీపీ తరుపున గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్ లోకి జంప్ చేశారు.

అయితే 2018లో వీరు టీఆర్ఎస్ నుంచి గెలిచారు…ఇప్పటికీ వారు స్ట్రాంగ్ గానే ఉన్నారట. పాలకుర్తిలో ఎర్రబెల్లి, సనత్ నగర్ లో తలసాని. అలాగే టీడీపీ నుంచి వచ్చిన వారిలో మాగంటి గోపినాథ్-జూబ్లీహిల్స్, వివేకానంద గౌడ్-కుత్బుల్లాపూర్, అరికెపూడి గాంధీ-శేరిలింగంపల్లి, మెచ్చా నాగేశ్వరరావు-అశ్వరావుపేట, సాయన్న-సికింద్రాబాద్ కంటోన్మెంట్, మాధవరం కృష్ణారావు-కూకట్ పల్లి..ఇలా టీడీపీ నుంచి వచ్చిన వారు టీఆర్ఎస్ లో ఇంకా బలంగా ఉన్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో వీరికి గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news