తెలంగాణ బీజేపీకి ‘సీఎం’ అభ్యర్ధి దొరికేశారు?

-

తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టం మొదలైంది….ఇంతకాలం టీఆర్ఎస్‌కు, కేసీఆర్‌కు తిరుగులేదు అన్నట్లుగానే పరిస్తితి ఉండేది. ఆయనకు అసలు పోటీగా ప్రతిపక్షాల్లో ఎలాంటి నాయకులు కనిపించలేదు. కానీ కేసీఆర్ తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు ఉన్నారు… గతంలో చంద్రబాబు… కేసీఆర్‌కు మంత్రి పదవి ఇవ్వకుండా, ఎలా తన గొయ్యి తానే తవ్వుకున్నారో అందరికీ తెలిసిందే. అప్పుడు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లే.. ఇప్పుడు తెలంగాణ వచ్చింది… ఆ రాష్ట్రానికి కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యారు.

etela-rajender | ఈట‌ల‌ రాజేందర్
etela-rajender | ఈట‌ల‌ రాజేందర్

మరి సీఎం కేసీఆర్ కూడా అలాంటి మిస్టేక్ చేశారు. ఉద్యమంలో తనతో పాటే నడిచిన, తన సహచరుడు ఈటల రాజేందర్‌కు కేసీఆర్ ఎలా చెక్ పెట్టాలని అనుకున్నారో కూడా అందరికీ తెలుసు. ఆయన్ని మంత్రి పదవి నుండి పీకేసి…పార్టీ నుంచి ఎలా బయటకు పంపారో కూడా తెలిసిందే. అలా బయటకొచ్చిన ఈటల…అనూహ్యంగా పదవికి రాజీనామా చేసి, కేసీఆర్‌ పతనానికి నాంది పలికారు. ఆ తర్వాత బీజేపీలో చేరి హుజూరాబాద్ బరిలో మరోసారి నిలబడి… కేసీఆర్ కుట్ర రాజకీయాలని తిప్పికొట్టి… మంచి మెజారిటీతో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచేశారు.

ఎమ్మెల్యేగా గెలవడమే కాదు… భవిష్యత్‌లో కేసీఆర్‌ సీటుకు ఎసరు పెట్టే నాయకుడు కూడా ఈటలనే అనే విధంగా పరిస్తితి మారింది. సాధారణంగా జాతీయ పార్టీల్లో ఒక నాయకుడు సెంటర్‌గా రాజకీయాలు నడవవు. అలాగే ముందు నుంచి సీఎం అభ్యర్ధి ఎవరు అనేది క్లారిటీ ఉండదు. ఏదో ఎన్నికల్లో గెలిస్తే మాత్రమే సీఎంని డిక్లేర్ చేస్తారు. అయితే ముందే సీఎం అభ్యర్ధిని డిసైడ్ చేయకపోవడమే జాతీయ పార్టీలు చేసే పెద్ద తప్పు… అదే ప్రాంతీయ పార్టీలకు పెద్ద అడ్వాంటేజ్. గత రెండు ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ గెలవడానికి ఇది కూడా ప్రధాన కారణం.

అటు కాంగ్రెస్‌లో గానీ, ఇటు బీజేపీలో గానీ ముందే సీఎం అభ్యర్ధి డిసైడ్ చేయలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్తితి. అయితే కాంగ్రెస్‌లో నలుగురైదుగురు సీఎం అభ్యర్ధులు ఉన్నారు. ఇటు బీజేపీలో కూడా అదే పరిస్తితి. కానీ ఈటల ఎంట్రీ, గెలుపుతో బీజేపీలో రాజకీయం మారిపోయిందనే చెప్పాలి. ఈటల కంటే బీజేపీకి సీఎం అభ్యర్ధిగా మరో నాయకుడు దొరకరనే చెప్పాలి. ఎందుకంటే ఏడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం… రాజకీయ విలువలు, నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేసే ఈటలకు సీఎం అభ్యర్ధి అయ్యే అర్హతలు అన్నీ ఉన్నాయి. ఇంకా కొందరు సీనియర్లు ఉన్నారు గానీ, ఈటలకు సీఎం అభ్యర్ధి అయ్యే పర్ఫెక్ట్ క్వాలిటీస్ ఉన్నాయి.

అలాగే ఉద్యమ నేతగా…. రాష్ట్రం మొత్తం తెలిసిన నాయకుడు… ప్రజలతో కలుపుగోలుగా ఊండే నేత… పార్టీ శ్రేణులని బలోపేతం చేసే సత్తా ఉన్న నాయకుడు. కాబట్టి బీజేపీకి సీఎం అభ్యర్ధి దొరికేసినట్లే కనిపిస్తోంది. అయితే బీజేపీ అధిష్టానం కూడా ఎన్నికల ముందే సీఎం అభ్యర్ధిని ప్రకటించి… ఎన్నికలకు వెళితే చాలా బెనిఫిట్… కాబట్టి ఈటలని సెంటర్ గా చేసుకుని బీజేపీ ముందుకెళితే… సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news