భూములు కొనేవాళ్లకు షాకివ్వబోతున్న కేసీఆర్

-

హైదరాబాద్ ఉన్నా సరే… తెలంగాణకు ఆదాయం రాబడి విషయంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. గత అయిదేళ్ళు గా పారిశ్రామిక రంగం పరంగా తెలంగాణా అనేక ఇబ్బందులు పడింది. కొత్త రాష్ట్ర౦ కావడంతో చాలా వరకు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి అటు ఇటు ఆలోచిస్తూ వచ్చాయి. దీనికి రాజకీయ కారణాలు కూడా కొన్ని జత కలిసాయి… పారిశ్రామిక రంగం విషయంలో కెసిఆర్ సర్కార్ ముందు నుంచి కాస్త దూకుడుగా వెళ్ళలేదు… దీనితో భారీగా ఆదాయం కూడా తగ్గుతూ వచ్చింది.

ఇప్పుడు దేశాన్ని ఆర్ధిక మాంద్యం వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఇది తెలంగాణాను కూడా ఇబ్బంది పెడుతుంది… దీనితో ఇప్పటికే కీలకమైన మద్యం ధరలను తెలంగాణా సర్కార్ పెంచింది. అయినా సరే ఆర్ధిక౦గా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో… తెలంగాణాలో రియల్ భూం పెరిగే అవకాశం ఉంది… దీనితో కెసిఆర్ సర్కార్ భూముల రిజిస్ట్రేషన్ ధరల విషయంలో…

దూకుడుగా వెళ్ళే ఆలోచనలో కెసిఆర్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో ఉన్న ధరలకు… ఇప్పుడు 40 శాతం వరకు పెంచే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. కేంద్ర కేబినెట్ లో జీఎస్టీపై జరిగిన సమావేశంలో ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ ధరలను పెంచాలని నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో తెలంగాణ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే దీనిపై కసరత్తు కూడా పూర్తి చేసినట్టు సమాచారం. ఈ నెల చివరి వారం లేదా… జనవరి మొదటి వారంలో… పెంచే అవకాశం ఉందని… కెసిఆర్ ఆమోద ముద్ర వేయడమే ఆలస్యమని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news