వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. బడ్జెట్లో భారీగా నిధులు..

-

వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది.. ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏకంగా 72 వేల 659 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.. కెసిఆర్ హయాంలో తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఆ దుస్థితి రాకుండా ఉండేందుకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యత వ్యవసాయ రంగానికి ఇచ్చామంటూ ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు.. ఇప్పటికే లక్ష రూపాయల మీద రుణమాఫీ చేసిన ప్రభుత్వం… మరో లక్షలోపు రుణాలు మాఫీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది..

తెలంగాణ బడ్జెట్ లో మొత్తం వ్యయం 2,91,159 కోట్ల రూపాయలు, రెవిన్యూ వ్యయం 2,20,945 కోట్లు, శాఖల వారీగా మంత్రి బడ్జెట్ను ప్రవేశపెట్టారు.. బీసీ సంక్షేమానికి 9,200 కోట్లు, హైదరాబాద్ సిటీ అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించారు. మైనార్టీ సంక్షేమానికి 3 వేల 3 కోట్లు, గృహ జ్యోతి పథకానికి 2 వేల 418 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.. ప్రభుత్వంలో కీలక శాఖగా ఉన్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 29 వేల 816 కోట్లు కేటాయించారు.. బడ్జెట్ గత ప్రభుత్వాల కంటే అద్భుతంగా ఉందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో కితాబిచ్చారు. గ్యాస్ సబ్సిడీ పథకానికి 723 కోట్లు కేటాయించిన్నట్లు తెలుస్తుంది..

అత్యధికంగా వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించడంపై తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అనే ఒక మెసేజ్ ని రైతందానికి కాంగ్రెస్ ప్రభుత్వం పంపినట్లయింది. దీంతోపాటు రుణమాఫీ చేసిన ప్రభుత్వం రైతులకు రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నారు. మొత్తంగా తెలంగాణ బడ్జెట్ పై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version