నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో అసమ్మతి నేతలు ఆ పార్టీకి తలనొప్పులుగా మారారు.. అభ్యర్థిగా కాకర్ల సురేష్ను ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఆయన వర్గం తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే బొల్లినేని రామారావుని పిలిపించి మాట్లాడినా కూడా ఆయన వర్గం సంతృప్తి చెందలేదట.. రామారావుకు జాతీయ స్థాయిలో పదవి కట్ట పెట్టినప్పటికీ.. ఆయన మాత్రం చంద్రబాబు తీరుపై ఆగ్రహంతో ఉన్నారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది.. 15 ఏళ్ల పాటు పార్టీని కనిపెట్టుకొని ఉన్న బొల్లినేని రామారావుకు టికెట్ ఇవ్వకపోవడంపై ఆయన వర్గము నేతలు అధిష్టానం తీరుపై కారాలు మిరియాలు నూరుతున్నారట..
తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అభ్యర్థిగా కాకర్ల సురేష్ ను ప్రకటించిన తరువాత.. బొల్లినేని రామారావు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని మరి అధిష్టానం తీరుపై తీవ్రమైన విమర్శలు చేశారు.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని ప్రకటించిన అనంతరం చంద్రబాబు పిలిపించి మాట్లాడారు.. దానికి రామారావు మెత్తబడకపోవడంతో పదవి కట్టబెట్టారు.. దానికి కూడా సంతృప్తి చెందని రామారావు పార్టీ కార్యక్రమంలో పాల్గొనకుండా బెంగళూరు వెళ్లారట.. తన పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచిన కాకర్ల సురేష్ ను ఓడించి తీరుతానని బొల్లినేని రామారావు తన వర్గం దగ్గర చెబుతున్నారట..
ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న సురేష్ కు కూడా క్యాడర్ సహకరించడం లేదని పార్టీలో ప్రచారం నడుస్తోంది.. కోట్ల రూపాయలు పార్టీకి ఫండ్ ఇచ్చి.. టిక్కెట్ తెచ్చుకున్న ఆనందం ఎక్కువసేపు కూడా నిలవడం లేదని.. క్యాడర్ సహకరించకపోతే గెలుపు అసాధ్యం అనే భావనలో సురేష్ ఉన్నారట.. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు సహకరిస్తేనే కాకర్ల సురేష్ కి విజయావకాశాలు ఉంటాయి.. ఈ వ్యవహారాలను గమనిస్తున్న చంద్రబాబుకి.. ఉదయగిరిలో టిడిపి గెలుపు కష్టమే అన్న భావన కలుగుతోందట..