గురివిందగింజ నీతులు: కేటీఆర్ ఆ ‘కహానీ’లు వర్కౌట్ కావు…!

ఇంకా తమకంటే రాజకీయం గొప్పగా చేసేవారు ఉండరని, తాము న్యాయంగా రాజకీయం చేస్తామని, తామే శుద్ధమైన రాజకీయ నేతలు అని, వేరే పార్టీల వాళ్ళు కుళ్ళు, కుట్ర రాజకీయాలు చేస్తారని, వారికి విలువలు ఉండవని…ప్రతి నాయకుడు…ప్రత్యర్ధి పార్టీలపై విమర్శలు చేస్తారు. అలాగే తెలంగాణలో టీఆర్ఎస్‌ని కేసీఆర్ తర్వాత నడిపించే నాయకుడు కేటీఆర్ కూడా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఒక్కటే శుద్ధమైన పార్టీ అన్నట్లుగా మాట్లాడుతూ….తమ పార్టీలో నాయకులంతా విలువలు ఉన్నవాళ్ళు అన్నట్లు చెబుతూ, ప్రత్యర్ధి పార్టీ నేతలకు విలువలు ఉండవని, ఆ పార్టీలు శుద్ధమైనవి కాదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు.

ktr
ktr

సరే తెలంగాణలో ఏ పార్టీ ఏంటి అనేది ప్రజలకు బాగా తెలుసు…ముఖ్యంగా టీఆర్ఎస్ ఎలాంటి రాజకీయాలు చేస్తుందో కూడా తెలుసు.. ఇతర పార్టీ ఎమ్మెల్యేలని ఏ మాత్రం విలువలు పాటించకుండా ఎలా చేర్చుకుంటారో కూడా తెలుసు. కానీ ఆ విషయాలని వదిలేసి… కాంగ్రెస్, బీజేపీలని ఉద్దేశించి తనదైన శైలిలో విమర్శించారు. రేవంత్‌ని ఉద్దేశించి గాంధీభవన్‌లో గాడ్సే దూరాడని, హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్‌ కూడా రాదని, ఈటల రాజేందర్‌.. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల ఉమ్మడి అభ్యర్థి అని, గోల్కొండ రిసార్ట్స్‌లో రేవంత్‌, ఈటల రహస్యంగా సమావేశమై ఒప్పందం కుదుర్చుకున్నారని మాట్లాడారు.

ఏడాదిన్నర తరువాత ఈటల కాంగ్రెస్‌లో చేరతారని, టీఆర్‌ఎస్‌ ఓటుబ్యాంకును చీల్చేందుకు కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయని, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, వైఎస్‌ షర్మిల.. బీజేపీ పన్నాగంలో పాచికలని కేటీఆర్ యథావిధిగా ఆరోపించారు. అంటే టీఆర్ఎస్ ప్రజలకు అండగా ఉండటంలో విఫలమైందని కొత్త పార్టీలు వస్తున్నాయని కేటీఆర్ అనుకోవడం లేదు. అలాగే టీఆర్ఎస్ ఎన్నిసార్లు ఎన్ని పార్టీలతో అంటకాగిందో చెప్పడం లేదు. టీఆర్ఎస్‌లో ఎంతమంది ఉత్తములు ఉన్నారో చెప్పడం లేదు.

అంటే గురివింద గింజలాగా…తన కింద నలుపుని మరిచిపోయి, పక్క పార్టీలపై పడుతున్నారు. అయితే కేటీఆర్ ఎన్ని కహానీలు చెప్పిన హుజూరాబాద్ ప్రజలు అవేమీ పట్టించుకోవడం లేదు…కేసీఆర్ ఏంటి? ఈటల ఏంటి? చెడు ఏంటి? మంచి ఏంటి? అనేవి మాత్రమే చూస్తున్నారు. కాబట్టి కేటీఆర్ ఎన్ని కహానీలు చెప్పిన హుజూరాబాద్ ప్రజలు నమ్మరు.