క‌రీంన‌గ‌ర్‌లో కీల‌క ఆఫీస‌ర్ల బ‌దిలీలు.. ఈట‌ల రాజేంద‌ర్ కు ఇక‌ ఇబ్బందులేనా..?

అధికారం అనేది ఎప్పుడూ ఎవ‌రికీ శాశ్వ‌తం కాద‌నే చెప్పాలి. కానీ దీన్ని ద‌క్కించుకోవ‌డం కోసం ఎంత చేయాలో అంత చేస్తుంటారు రాజ‌కీయ పార్టీల‌కు ఇప్పుడు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే స్థానికంగా ఉండే అన్ని డిపార్టుమెంట్ల‌లో ఉద్యోగ‌స్తులతో స‌న్నిహితంగా ఉండ‌ట‌మే. ఇక ఇప్పుడు జ‌రుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ఎలాగైనా ఈట‌ల రాజేంద‌ర్ మీద గెలిచేందుకు అన్ని అస్త్రాల‌ను ప్ర‌యోగిస్తోంది టీఆర్ ఎస్ అధిష్టానం.

ఇప్ప‌టికే ఈట‌ల రాజేంద‌ర్‌కు ట‌చ్‌లోఉన్న అంద‌రు అధికారుల‌ను ట్రాన్స్‌ఫ‌ర్‌చేసిన ప్ర‌భుత్వం ఇప్ప‌డు మ‌రో కీల‌క ఆఫీస‌ర్‌ను ట్రాన్స్‌ఫ‌ర్ చేసింది. ఇప్పుడు క‌రీంన‌గ‌ర్ సీపీగా ఉన్న క‌మ‌ల్ హాస‌న్ రెడ్డిని డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ట్రాన్స్‌ఫ‌ర్ చేసింది ప్ర‌భుత్వం. ఇక ఇప్పుడు ఆయ‌న ప్లేస్‌లో రామ‌గుండం సీపీని ఆయ‌న ప్లేస్‌లో నియామ‌కం చేసింది.

దీంతో క‌రీంన‌గ‌ర్ జిల్లాలో అధికార యంత్రాంగం ట్రాన్స్‌ప‌ర్లు ఇంకా జ‌రుగుతూనే ఉన్నాయ‌ని తెలుస్తోంది. అంటే ఈట‌ల రాజేంద‌ర్‌కు మొద‌టి నుంచి క‌రీంగ‌న‌ర్ సీపీతో మంచి సంబంధాలు ఉండ‌టంతో ఇది ఎన్నిక‌ల వేళ టీఆర్ ఎస్ అడ్డంకిగా మారుతుంద‌ని భావించిన టీఆర్ఎస్ క‌రీంన‌గ‌ర్ క‌లెక్ట‌ర్‌ను ట్రాన్స్‌ప‌ర్ చేసిన వారానికే ఇప్పుడు సీపీని ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మొత్తానికి ఈట‌ల రాజేంద‌ర్ మీద ఒత్తిడి పెంచేందుకు అధిష్టానం బాగానే ట్రై చేస్తుంది.