మాట తప్పితే ఆరు నెలల్లో రాజీనామా చేస్తా: తెలంగాణా మంత్రి సవాల్

వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలను అధికార పార్టీ నేతలు సీరియస్ గా తీసుకుని ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో కాంగ్రెస్ కూడా ఘాటు విమర్శలు చేస్తుంది. తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆరు నెలల్లో టెక్స్ టైల్ పార్క్ పనులు ప్రారంభిస్తాం లేదంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని ఆయన స్పష్టం చేసారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అర్థ రహితం అని అన్నారు.

గిరిజన యూనివర్సిటీ కోసం భూమిని కేటాయించాము అని తెలిపిన ఆయన… కానీ కేంద్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయడం లేదు అని మండిపడ్డారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం నిరంతర పోరాటం చేస్తాం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వనికి సహకరించడం లేదు అని మండిపడ్డారు.