కమలానికి కారు మద్ధతు.. అసలు ఏం జరుగుతోంది?

-

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఎలాంటి యుద్ధ వాతావరణం ఉందో అందరికీ తెలిసిందే. టీఆర్ఎస్-బీజేపీలు ఉప్పు-నిప్పు మాదిరిగా ఉన్నాయి. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్తితి. అసలు కేసీఆర్, బండి సంజయ్‌ల మధ్య ఎలాంటి వార్ జరుగుతుందో తెలిసిందే. ఇక ధాన్యం కొనుగోలు అంశంపై రెండ్ పార్టీల మధ్య పెద్ద రచ్చ నడుస్తోంది. తాజాగా జి‌హెచ్‌ఎం‌సి సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు ఏ స్థాయిలో టీఆర్ఎస్ మేయర్‌పై విమర్శలు చేశారో కూడా తెలిసిందే.

bjp-trs
bjp-trs

అసలు తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీలు నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఇలా రాజకీయంగా శత్రువులుగా ఉన్న ఈ రెండు పార్టీలు ఒక్కటే అని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి….టీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటే అని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మోదీ-కేసీఆర్‌లు దోస్తీ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. అదే సమయంలో టీఆర్ఎస్, బీజేపీలు ఒకటే అని బి‌ఎస్‌పి నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం కామెంట్ చేస్తున్నారు.

అయితే తాజాగా భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయత్‌ సైతం…రెండు పార్టీల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి టీఆర్‌ఎస్‌ సహా వైసీపీ, మజ్లిస్‌ పార్టీలు బీ టీమ్‌ అని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అన్ని విధాలా మద్దతు ఇచ్చిన సీఎం కేసీఆర్‌.. సాగు చట్టాలకు వ్యతిరేకమని చెబితే నమ్మలేమని మాట్లాడారు.

అంటే సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతులకు నాయకత్వం వహించిన రాకేశ్ లాంటి వారు…బీజేపీ-టీఆర్ఎస్‌లు ఒక్కటే అనే రీతిలో మాట్లాడుతున్నారు. కానీ రాష్ట్రంలో చూస్తే ఆ పరిస్తితి కనిపించడం లేదు. రెండు పార్టీల మధ్య వార్ గట్టిగా జరుగుతోంది. మరి అలాంటప్పుడు రెండు పార్టీలు ఒక్కటే అనే రీతిలో ఇతర నేతలు మాట్లాడుతున్నారు. అయితే అప్పుడప్పుడు కేసీఆర్…కేంద్రంతో దగ్గరవుతున్నట్లు రాజకీయం చేశారు. కానీ బీజేపీ ఎప్పుడు..కేసీఆర్‌తో యుద్ధమే చేస్తుంది. అందుకే ఇప్పుడు బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటే అని విమర్శలు వస్తున్నాయి. ఇదంతా కేసీఆర్ రాజకీయ క్రీడలాగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news