దళితబంధులో ట్విస్ట్‌…ఇప్పటిలో కష్టమే!

తెలంగాణ సీఎం కేసీఆర్…రాష్ట్రంలోని దళిత ప్రజలని ఆదుకోవాలనే లక్ష్యంతో దళితబంధు పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఉపఎన్నిక జరగనున్న హుజూరాబాద్ వేదికగా ఈ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఒక్కో దళిత కుటుంబానికి పది లక్షలు ఇవ్వనున్నారు. అయితే హుజూరాబాద్‌లో ఉన్న అన్నీ దళిత కుటుంబాలకు కేసీఆర్, ఈ పథకం ఇవ్వనున్నారు. అలాగే ఆ తర్వాత రాష్ట్రంలో 118 నియోజకవర్గాల్లో ఉన్న దళిత కుటుంబాలకు పథకం ఇవ్వనున్నారు.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

అయితే ఈ పథకం అమలు సాధ్యం కాదని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చిన సందర్భంలో, వారికి కేసీఆర్ కౌంటర్ ఇస్తూ దళితబంధుని అన్నీ దళిత కుటుంబాలకు అందేలా చేస్తామని,  ఉద్యోగాలు చేసే వారికి కూడా పథకం వర్తిస్తుందని చెప్పారు. అయితే రాష్ట్రంలో దాదాపు 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని, ఈ పథకానికి లక్షా 70 వేల కోట్లు అవుతాయని కేసీఆర్ చెప్పారు.

అయితే ఏడాది 30 వేల కోట్ల వరకు దళితబంధుకు ఖర్చు పెడతామని కేసీఆర్ చెప్పారు. అంటే రాష్ట్రంలో దళిత కుటుంబాలకు పథకం పూర్తిగా అందేసరికి నాలుగైదేళ్లు పైనే పడుతుంది. అంటే నెక్స్ట్ ఎన్నికలయ్యాక కూడా పథకం ఇవ్వాలి.

కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మరో రెండేళ్లలో తెలంగాణలో ఎన్నికలు రావడం ఖాయం. అప్పటిలోపు పూర్తిగా పథకాన్ని అమలు చేయడం అసాధ్యం. పైగా నెక్స్ట్ కూడా కేసీఆర్ అధికారంలోకి వస్తేనే పథకం అమలవుతుంది. అంటే వచ్చే ఎన్నికలో కూడా కేసీఆర్ గెలవాలి. మరి తెలంగాణలో ఆ పరిస్తితి ఉందా? అంటే చెప్పలేని పరిస్తితి ఉంది. కాకపోతే నెక్స్ట్ తాను గెలిస్తేనే పథకం వస్తుందనే ఆశలు దళిత వర్గాల్లో కేసీఆర్ కలిగించవచ్చు. అది కూడా ఓ రకంగా కేసీఆర్‌కు అడ్వాంటేజ్. కానీ పథకం అమలు చేసే తీరు బాగోకపోతే పథకం వల్లే ఎన్నికల్లో కేసీఆర్‌కు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి.