గులాబీ పార్టీకి ఉత్తమ్ ఫ్యామిలీ చెక్?   

-

గత ఎన్నికల్లో బడా బడా నేతలకు టీఆర్ఎస్ పార్టీ చెక్ పెట్టిన విషయం తెలిసిందే..కేసీఆర్ తన పదునైన వ్యూహాలతో కాంగ్రెస్ లో ఉన్న పెద్ద నాయకులని ఓడించారు. పెద్దగా ఓటమి ఎరగని నేతలు సైతం దారుణంగా ఓడిపోయారు. ఊహించని విధంగా జానారెడ్డి, కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి, గీతారెడ్డి, దామోదర్ రెడ్డి, షబ్బీర్ అలీ ఇలా ఇలా బడా నేతలు ఓడిపోయారు. కానీ కేసీఆర్ వ్యూహాలని తట్టుకుని కొందరు సీనియర్లు గెలిచారు. అలా గెలిచిన వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒకరు. హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ మరొకసారి విజయం సాధించారు. కానీ కోదాడలో ఉత్తమ్ భార్య పద్మావతి స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు.

అసలు కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలు ఉత్తమ్ ఫ్యామిలీకి కంచుకోటలు లాంటివి. అయితే అనూహ్యంగా ఉత్తమ్…పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలిచారు..దీంతో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే హుజూర్ నగర్ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ భార్య పద్మావతి నిలబడగా, టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి పోటీ చేశారు. ఇక ఉపఎన్నికలో సైదిరెడ్డి మంచి మెజారిటీతో గెలిచారు. దీంతో కోదాడతో పాటు హుజూర్ నగర్ స్థానాన్ని ఉత్తమ్ ఫ్యామిలీ కోల్పోయింది.

అయితే వచ్చే ఎన్నికల్లో రెండుచోట్ల ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉత్తమ్ పనిచేస్తున్నారు. రెండు స్థానాల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. నిత్యం ప్రజల్లోనే తిరుగుతున్నారు. అటు రెండు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. ముఖ్యంగా కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్ పై వ్యతిరేకత ఎక్కువ ఉంది. మల్లయ్యకు నెక్స్ట్ గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

అటు హుజూర్ నగర్లో కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే పరిస్తితి అంతే…నెక్స్ట్ కోదాడలో పద్మావతి, హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేయడం ఖాయమే…అలాగే వారు…కారుకు చెక్ పెట్టడం కూడా ఖాయమే అని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. మొత్తానికి ఈ సారి ఉత్తమ్ ఫ్యామిలీ విజయం అందుకేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news