ఉత్తర్ ప్రదేశ్ లో రెండో సారి అధికారం చేపట్టేందుకు యోగీ ఆదిత్య నాథ్ సిద్ధం అవుతున్నారు. ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలను సాధించింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉంటే బీజేపీ కూటమి 273 స్థానాల్లో గెలుపొంది. వరసగా రెండోసారి అధికారంలోకి రానుంది. తాజాగా ఈనెల మార్చి 25న యోగీ ఆదిత్యానాథ్ ప్రమాణ స్వీకాారానికి మూహూర్తం ఖరారైంది. ఆరోజు సాయంత్రం 4 గంటలకు యూపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటికు మంత్రి వర్గ కూర్పుపై యోగీ ఢిల్లీలోని పార్టీ పెద్దలను కలిశారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు, పార్టీ అధ్యక్షడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలిశారు. పార్టీలోని పెద్దలతో చర్చించి.. కుల, మత, ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని మంత్రివర్గంలో ఎవరెవరికి పదవులు ఇవ్వాలనే దానిపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు అవుతారని తెలుస్తోంది. మరోవైపు సోనియా, ములాయం, మాయావతిలను ఆహ్వానించే అవకాశం ఉంది.