సుశీల్ అహ్మదాబాద్‌కు వెళ్తున్నాడని తెలుసుకున్న పార్వతి యోగితా ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వచ్చి డూప్లికేట్ కీ సహాయంతో ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న యోగితను గొంతు నులిమి చంపేసింది.
ఉన్న ఇద్దరు భార్యలు సరిపోరని ఓ వ్యక్తి ఏకంగా మరో మహిళను మూడో వివాహం చేసుకున్నాడు. ఆ మహిళతో అతను సంసారం చేస్తూ ముందు ఉన్న ఇద్దరు భార్యలను, వారి పిల్లలను వదిలేశాడు. వారి బాగోగులు చూడడం మానేశాడు. దీంతో కడుపు మండిన రెండో భార్య.. మొదటి భార్య పిల్లల సహాయంతో ఆ వ్యక్తి మూడో భార్యను చంపేశారు. ముంబైలో కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే…
ముంబైకి చెందిన సుశీల్ మిశ్రా (45) కాంట్రాక్ట్ లేబరర్‌గా పనిచేస్తున్నాడు. అతని మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు. ఆమె తన పిల్లలతో కలసి ఉత్తర ప్రదేశ్ లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో సుశీల్ పార్వతి మనె అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆమెకు ఇద్దరు కూతుళ్లు జన్మించారు. అయితే సుశీల్ తాజాగా యోగితా దేవ్రె (35) అనే మరో మహిళన మూడో వివాహం చేసుకుని ఆమెతోపాటు ముంబైలోని నలసొపర అనే ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు.
ఈ క్రమంలో సుశీల్ ఓ సారి పార్వతిని యోగితా సమక్షంలో తీవ్రంగా దూషించాడు. అప్పటి నుంచి పార్వతితో మాట్లాడడం, ఆమెను కలవడం మానేశాడు. అలాగే ఆమెకు నెల నెలా పంపించే డబ్బును కూడా ఇవ్వడం మానేశాడు. దీంతో పార్వతి పగ పెంచుకుంది. ఎలాగైనా యోగితాను చంపాలని ఆమె నిర్ణయించుకుంది. దీనికి గాను ఆమె మొదటి భార్య కూతుళ్లు, వారిలో ఒక కూతురు బాయ్ ఫ్రెండ్ సహాయం తీసుకుంది. ఈ క్రమంలోనే సుశీల్ అహ్మదాబాద్‌కు వెళ్తున్నాడని తెలుసుకున్న పార్వతి యోగితా ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వచ్చి డూప్లికేట్ కీ సహాయంతో ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న యోగితను గొంతు నులిమి చంపేసింది. ఆ తరువాత పార్వతి తన ఇద్దరు సవతి కూతుళ్లు, ఒక కూతురు బాయ్ ఫ్రెండ్.. మొత్తం నలుగురు కలిసి యోగిత మృతదేహాన్ని సిటీ శివారుకు తరలించి అక్కడ పారేశారు. అయితే యోగిత మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా అసలు విషయం తెలిసింది. దీంతో వారు నేరానికి పాల్పడ్డ పార్వతితోపాటు ఆమె సవతి కూతుళ్లు, మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు..!