బాబు-పవన్ కమలానికి ప్లస్ అవుతారా?

-

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ వచ్చింది..ఇప్పటివరకు టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీగా వార్ నడుస్తున్న విషయం తెలిసిందే…ఇలాంటి తరుణంలో ఏపీ రాజకీయాలతో ముడిపడేలా… తెలంగాణ రాజకీయాలు నడుస్తాయని కామెంట్స్ వస్తున్నాయి. గతంలో చంద్రబాబు… రెండు రాష్ట్రాల్లో రాజకీయం చేసేవారు…కానీ దీని వల్ల టీడీపీ పూర్తిగా దెబ్బతింది..దీంతో ఆయన తెలంగాణలో పూర్తిగా దుకాణం సర్దేసి..ఏపీపైనే ఫోకస్ పెట్టారు.

pawan kalyan chandrababu

ఇక అంతే ఆ తర్వాత ఏ ఏపీ నాయకుడు కూడా తెలంగాణలో రాజకీయం చేయట్లేదు. అటు జగన్ ఏపీకి పరిమితమైతే..షర్మిల తెలంగాణలో రాజకీయం చేసుకుంటున్నారు. ఇలా ఎవరికి వారే సెపరేట్ గా రాజకీయం చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా తెలంగాణ రాజకీయాలు మరో మలుపు తిరిగేలా ఉన్నాయి. చంద్రబాబు-పవన్ కల్యాణ్..తెలంగాణ రాజకీయాల్లో కీ రోల్ పోషించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అది కూడా తెలంగాణలో బీజేపీని గెలిపించేందుకు వారు రంగంలోకి దిగబోతున్నారని అంటున్నారు.

అయితే ఈ విషయాలని చెబుతుంది ఎవరో కాదు…ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు. తాజాగా ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబు..మోదీని కలిసిన విషయం తెల్సిందే. ఓ ఐదు నిమిషాల పాటు వారు మాట్లాడుకున్నారు. కేవలం కుశల ప్రశ్నలే తప్ప…వారి మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదనేది తెలుస్తోంది. కానీ దీనికి వైసీపీ కొత్త మాటలు చెబుతుంది…ఢిల్లీకి వెళ్ళిన బాబు…బీజేపీకి ఆఫర్ ఇచ్చారని, తెలంగాణలో తాను, పవన్ కలిసి బీజేపీకి సహకరిస్తామని, ఏపీలో తమకు సహకరించాలని అడిగినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఇలాగే బాబు-మోదీ కలయికపై స్టోరీ చెప్పారు.

మరి ఇందులో ఎంత వాస్తవం ఉందనేది ఎవరికి తెలియదు. ఇది కేవలం వైసీపీ కల్పిత కథ అని ఇటు టీడీపీ, అటు బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. అయినా తెలంగాణలో బాబు-పవన్ లకు పెద్ద బలం లేదు…వారు ఎంట్రీ ఇస్తే మళ్ళీ కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ లేపి..లాభపడాలని చూస్తారు. దీని వల్ల బీజేపీకి నష్టమే తప్ప లాభం లేదు. అసలు బాబు-పవన్ సపోర్ట్ తీసుకోవాలని తెలంగాణ బీజేపీ నాయకత్వం చూడటం లేదు..సొంతంగానే సత్తా చాటాలని వారు చూస్తున్నారు. కాబట్టి ఇదంతా వైసీపీ కల్పితకథ అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news