ముందస్తు ఫిక్స్: కేసీఆర్-జగన్‌లను నమ్మలేమా?  

-

ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో కామన్ గా వినిపిస్తున్న పాయింట్ ఏమైనా ఉందంటే అది ముందస్తు ఎన్నికల గురించే..రెండు రాష్ట్రాల్లోనూ ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతుంది..అటు తెలంగాణ సీఎం కేసీఆర్, ఇటు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం గ్యారెంటీ అని చర్చలు నడుస్తున్నాయి. తమపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత పెరగక ముందే ముందస్తు ఎన్నికలకు వెళితే బెటర్ అనే ఆలోచనలో కేసీఆర్, జగన్ ఉన్నారని విశ్లేషణలు వస్తున్నాయి.

అయితే తెలంగాణలో అంతకముందు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన విషయం తెలిసిందే. ముందస్తుకు వెళ్ళి సక్సెస్ అయ్యారు..ఇక మరొకసారి కూడా ఆయన ముందస్తుకు వెళ్ళే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. మామూలుగా చూసుకుంటే 2023 డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. కానీ అంతకంటే ముందే కేసీఆర్ ముందస్తుకు వెళ్తారని ప్రచారం వస్తుంది. 2023 ఫిబ్రవరిలో ప్రభుత్వాన్ని రద్దు చేసి…2023 మే నెలలో ఎన్నికలకు వెళ్లొచ్చని తెలుస్తోంది.

కేసీఆర్ ముందస్తుకు వెళ్ళే విషయంపై ప్రతిపక్ష పార్టీ లైన బీజేపీ, కాంగ్రెస్ బాగా నమ్మకంగా ఉన్నాయి. ఖచ్చితంగా కేసీఆర్ ముందస్తుకు వెళ్తారని రెండు పార్టీ నేతల స్ట్రాంగ్ గా చెబుతున్నారు. రెండు పార్టీల అధిష్టానాలు కూడా  ముందస్తు ఎన్నికల విషయంపై ఆ పార్టీ నేతలని అలెర్ట్ చేస్తున్నారు. ఇక ఏపీలో జగన్ కూడా ముందస్తుకు వెళ్తారని అక్కడ ప్రతిపక్ష టీడీపీ చెబుతుంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, కాబట్టి ఆ వ్యతిరేకత పూర్తిగా పెరగక ముందే జగన్…ఎన్నికలకు వెళ్తారని, అంటే 2024 ఏప్రిల్ కంటే ముందుగానే ఎన్నికలకు వెళ్ళే ఛాన్స్ ఉందని అంటున్నారు.

అయితే ముందస్తుపై వైసీపీ నేతలు క్లారిటీ ఇవ్వడం లేదు గాని..టీడీపీ మాత్రం ముందే ప్రిపేర్ గా ఉంటుంది…జగన్ ని నమ్మడానికి వీల్లేదని, ఎలాగైనా ముందస్తుకు వెళ్ళే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. మొత్తానికి కేసీఆర్-జగన్ ముందస్తుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news