ఆ ఫార్ములా బీజేపీకి వర్కౌట్ అవుతుందా? బెడిసికొడుతుందా?

-

బీజేపీ (BJP) అంటే హిందూ మతం ఆధారంగా పుట్టుకొచ్చిన పార్టీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పార్టీ హిందూ మతం కోసమే ఎక్కువ పనిచేస్తుందని ప్రజలందరికీ తెలిసిందే. అయితే బీజేపీ రాజకీయాలు కూడా మతం ఆధారపడే ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఈ మత రాజకీయాలు అన్నివేళల వర్కౌట్ అవ్వడం కష్టం. ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో మత రాజకీయాలు అంతగా వర్కౌట్ అవ్వవనే చెప్పొచ్చు.

కానీ బీజేపీ అదే ఫార్ములాతో ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే బీజేపీ, ఎం‌ఐ‌ఎం అధినేత అసదుద్దీన్‌ని టార్గెట్ చేసి, కేసీఆర్‌ని దెబ్బకొట్టాలని ఎప్పటినుంచో చూస్తుంది. తాజాగా కూడా ఎంపీ ధర్మపురి అరవింద్ అదే తరహాగా రాజకీయంగా కామెంట్లు చేశారు. తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌.. మజ్లిస్‌ నేతలు ఒవైసీలకు పెంపుడు కుక్కలా మారారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే రాష్ట్రంలో గులాబీ అండర్‌వేర్స్ వేసుకున్న కొందరు పోలీసు అధికారులు రోహింగ్యాలకు పాస్ పోర్టులు ఇస్తున్నారని మండిపడ్డారు.

అటు హిందూ సమాజానికి కాంగ్రెస్ అతి పెద్ద శత్రువు అని, ముస్లింల ఓట్ల కోసం రేవంత్ నాటకలాడుతున్నారని ఫైర్ అవుతున్నారు. అయితే బీజేపీ వ్యాఖ్యలు చూస్తుంటే కేవలం హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. పైగా రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు గానీ, మరి అడ్డగోలుగా వ్యక్తిగతమైన విమర్శలు చేయడం కరెక్ట్ కాదు.

కానీ అరవింద్ దారుణమైన విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి విమర్శలు వల్ల ఆ పార్టీకే డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే హిందూ మతంతో రాజకీయాలు కూడా అంతగా వర్కౌట్ కాకపోవచ్చు. కాబట్టి బీజేపీ మత రాజకీయాలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news