జగన్‌ని కేసీఆర్ అలా అన్నారా….ఆ వర్గాలు ఎవరు?

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. తాజాగా జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో కేసీఆర్, జగన్‌పై విరుచుకుపడ్డారట. తెలంగాణకు అన్యాయం చేసే విషయంలో రాజశేఖర్‌రెడ్డి కంటే మూర్ఖంగా జగన్‌ ముందుకెళ్తున్నారని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌కు చట్టాలపై ఏమాత్రం గౌరవం లేదని, అక్రమ ప్రాజెక్టులే అందుకు నిదర్శనమని కేసీఆర్ మండిపడ్డారట. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీళ్లను ఎత్తుకుపోతున్నారని దీనిపై పోరాడతామని కేసీఆర్ చెప్పారట.

కేసీఆర్

ఇది టీడీపీకు అనుకూలంగా ఉన్న ప్రముఖ మీడియా సంస్థ ప్రచురించిన కథనం. అయితే నీళ్ళ విషయంలో కేబినెట్‌లో చర్చకు వచ్చిందని పలు మీడియాల్లో వార్తలు వచ్చాయి గానీ, జగన్‌ని మూర్ఖుడు అని కేసీఆర్ అన్నారని ఒక్క టీడీపీ అనుకూల మీడియాలో తప్ప, ఏ మీడియాలోనూ రాలేదు. కాకపోతే ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ (ఆర్డీఎస్) కుడి కాల్వ నిర్మాణాలను కేబినెట్ తీవ్రంగా నిరసన తెలిపిందని కథనాలు వచ్చాయి.

కానీ టీడీపీ అనుకూల మీడియా మాత్రం జగన్‌ని మూర్ఖుడు అని తిట్టినట్లు రాసుకొచ్చేసింది. అది కూడా డైరక్ట్‌గా చెప్పలేదు. ఏదో విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అని మాత్రం చెప్పుకొచ్చారు. తెలంగాణకు గతంలో వైఎస్సార్ అన్యాయం చేశారని, ఆయనకంటే మూర్ఖంగా జగన్ ముందుకెళుతున్నారని ప్రచారం చేసింది. అయితే వేరే మీడియా సంస్థలకు చెప్పని విశ్వసనీయ వర్గాలు, టీడీపీకి అనుకూల మీడియాకు ఎలా చెప్పారని రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇదంతా టీడీపీ అనుకూల మీడియా క్రియేటివిటీ అని, ఆ కథనాలని కొందరు కొట్టిపారేస్తున్నారు. కాకపోతే కృష్ణా బేసిన్‌లో ఏపీ సర్కారు నిర్మించే ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసి ఉండొచ్చని, మిగతా మాటలన్నీ క్రియేట్ చేసినవే అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news