జగన్ అనే నేను.. రెడీ అవుతున్నాను.. 19న నేతలతో జగన్ మీటింగ్

-

ఈనెల 19న దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వస్తాయి. ఎగ్జిట్ పోల్స్ రాగానే.. వైసీపీ కీలక నేతలతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వస్తే ఏంలేదు కానీ.. ఒకవేళ వైసీపీకి మెజార్టీ కంటే తక్కువ స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తే… ఏం చేయాలి

రాజకీయం చేయాలంటే చాలా తెలివి ఉండాలి. బలగం, డబ్బు, అధికారం లేకున్నా సరే.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తక్షణమే సరైన నిర్ణయాలు తీసుకోగలగాలి. అప్పుడే రాజకీయాల్లో ఇమడగలం. ఇప్పుడు వైఎస్ జగన్ అదే చేస్తున్నారు. మే 23న ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఇంకో 13 రోజులే ఉంది. దీంతో చకచకా పావులు కదుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ధ్యేయంగా ఆయన ముందుకెళ్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు తమకు మెజారిటీ వస్తుందన్న భావనలోనే వైసీపీ ఉన్నప్పటికీ.. ఎందుకైనా మంచిదని అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాకున్నా సరే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు సాగిస్తోంది వైసీపీ.

ysjagan meeting with party leaders on may 19th

ఈనెల 19న దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వస్తాయి. ఎగ్జిట్ పోల్స్ రాగానే.. వైసీపీ కీలక నేతలతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వస్తే ఏంలేదు కానీ.. ఒకవేళ వైసీపీకి మెజార్టీ కంటే తక్కువ స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తే… ఏం చేయాలి.. నెక్స్ స్టెప్ ఏం తీసుకోవాలి.. అనే విషయాలను పార్టీ నేతలతో జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

అయితే.. 2014లో వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేసిన విషయంపై ఈసారి జగన్ కాస్త జాగ్రత్తగానే వ్యవహరించనున్నారు. అప్పటిలా కాకుండా ఈసారి మరింత జాగ్రత్తలు తీసుకోనున్నారు. తమ ఎమ్మెల్యేలను చంద్రబాబు లాక్కోనకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. అందుకే.. గెలిచే ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇంచార్జిలతో టచ్‌లో ఉండాలని ఆదేశించినట్లు సమాచారం.

ఒకవేళ మెజారిటీకి కాస్త అటూ ఇటుగా వైసీపీకి సీట్లు వస్తే.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుపై కూడా కీలక నేతలతో జగన్ చర్చించనున్నారట. హంగ్ వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా వైసీపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా మంత్రాంగాలు నడిపిస్తున్నాడట. అందుకే… 19న కీలక నేతలతో జగన్ మీటింగ్ అత్యంత కీలకం కానుంది. అది రాష్ట్ర భవిష్యత్తునే మార్చే మీటింగ్ కూడా కావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో..

Read more RELATED
Recommended to you

Latest news