లోకేష్‌కు ప్లస్…జగన్‌కు మైనస్..వైసీపీ నేతలు ఇంత చేశారా?

-

ఎంతో కష్టపడి జగన్….వైసీపీని గెలిపించుకుని అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన, అదే స్థాయిలో ప్రజల మన్ననలు పొందేలా పాలన చేస్తున్నారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ళల్లో జగన్‌కు పెద్దగా మైనస్ ఏమి రాలేదు. కానీ కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకుల పనుల వల్ల జగన్‌కు ఇబ్బంది అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు అక్రమాలు, అవినీతి చేయడంలో ముందున్నరని విమర్శలు వస్తున్నాయి.

ఇవే వైసీపీకి బాగా నెగిటివ్ అవుతున్నాయి. దీనికితోడు వైసీపీ నేతలు అనవసరంగా టీడీపీకి ప్లస్ అయ్యేలా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా ఓ దుర్మార్గుడు చేతులో హత్య చేయబడ్డ రమ్యశ్రీ కుటుంబాన్ని నారా లోకేష్ పరామర్శించడానికి వెళ్ళిన విషయం తెలిసిందే. మామూలుగా వదిలేసి ఉంటే లోకేష్ పరామర్శించుకుని వెళ్లిపోయేవారు. కానీ అదే సమయంలో రమ్యశ్రీ ఇంటి వద్ద వైసీపీ నేతలు చేసిన హడావిడి వల్ల అటు లోకేష్‌కు ప్లస్ అవ్వడం, ఇటు జగన్‌కు మైనస్ అవ్వడం జరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు.

లోకేష్ వచ్చిన సమయంలోనే రమ్యశ్రీ ఇంటి దగ్గరకు కొందరు వైసీపీ నేతలు రావడం, పోలీసులు కూడా వైసీపీ నేతలని పట్టించుకోకపోవడం, లోకేష్‌కు వ్యతిరేకంగా వైసీపీ నేతలు నినాదాలు చేయడం, ప్రతిగా టీడీపీ శ్రేణులు కూడా జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పెద్ద రచ్చ జరిగింది.

ఈ క్రమంలోనే పోలీసులు…వైసీపీ నేతలని పట్టించుకోకుండా, కేవలం లోకేష్, టీడీపీ నేతలని అరెస్ట్ చేశారు. దీని వల్ల అనవసరంగా లోకేష్, టీడీపీ నేతలు హైలైట్ అయ్యారు. అదేరోజు జగన్…నాడు-నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చెందిన ప్రభుత్వ పాఠశాలలని ప్రారంభించారు. వైసీపీ నేతల రచ్చ వల్ల ఈ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్లలేదు. అంటే వైసీపీ నేతల వల్ల…లోకేష్‌కు ప్లస్ అయితే, జగన్‌కు మైనస్ అయిందని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news